అల్లుడు నియోజకవర్గానికి చేరుకున్న బాలకృష్ణ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి బాలకృష్ణ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అటు రాజకీయాలలోను, ఇటు సినిమా ఇండస్ట్రీలో బాగానే రాణిస్తున్నారని చెప్పవచ్చు. తాజాగా అఖండ సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్నాడు బాలయ్య. ఈ రోజున సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గుంటూరు పర్యటన పెట్టుకున్నారు. నిన్నటి రోజు రాత్రి విజయవాడకు చేరుకున్న బాలకృష్ణ ఉదయాన్నే తన అల్లుడు నియోజకవర్గమైన మంగళగిరి కి వెళ్లారు.

అది కేవలం రాజకీయ పర్యటన కాదు వ్యక్తిగత పర్యటన ని బాలకృష్ణ తెలియజేశారు. ముందుగా మంగళగిరి లో ఉండేటువంటి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేయించారు. అక్కడి నుంచి పెదకాకాని కి ఆలయంలో దైవ దర్శనం చేసుకున్నారు. అనంతరం బోయపాటి శ్రీను స్వగృహానికి చేరుకున్నారు. అఖండ హిట్ సినిమా తర్వాత బాలకృష్ణ అభిమానులకి కాదు అందరికీ బాగా నచ్చారు బాలకృష్ణ. సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో ఉంటున్న బాలకృష్ణ తాజాగా అఖండ సినిమాతో ఇండస్ట్రీలో కి మంచి శకునములా విడుదల చేశారు. ఇక ఈ సినిమాతో పెద్ద సినిమాలకు కాస్త ఊరట లభించిందని చెప్పవచ్చు.

Share.