అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన తాజా చిత్రం పుష్ప ది రైజ్.. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఈయన తాను చూసిన సాధారణ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఫిదా అయిపోయారు. తాజాగా సమంతా కూడా పుష్ప లోనీ నటన చూసి చాలా థ్రిల్ అయినట్లుగా తెలియజేసింది.
ఈ సందర్భంగా సమంత ఒక మెసేజ్ రూపంలో పోస్టులు చేస్తూ.. ఇది అల్లు అర్జున్ పై ప్రశంసల పోస్ట్.. పుష్ప లో అల్లు అర్జున్ ప్రతి సెకను మిమ్మల్ని కట్టిపడేసే ప్రదర్శన చేశాడు.. ఒక నటుడు అసాధారణమైన ప్రదర్శనతో గొప్ప నటన కనబరిస్తే ఆ నటన నుంచి నేను ఎప్పుడూ స్ఫూర్తిని పొందుతాను. అల్లు అర్జున్ నటన ఖచ్చితంగా అద్భుతమైనది. నిజంగా స్ఫూర్తిదాయకం.. అంటూ సమంత ఒక మెసేజ్ ను పోస్ట్ చేసింది.
ఇక సమంత ఈ సినిమాలో చేసిన ప్రత్యేక గీతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా చేస్తోంది. మొదట ఈ పాటని చెప్పగానే రిజెక్ట్ చేశాను.. ఆ తర్వాత చేయడానికి ఒప్పుకున్నాను అంటూ తెలియజేసింది. టిఫిన్ ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను నమోదు చేస్తోందంటూ తెలియజేసింది.