అల్లు శిరీష్ ప్రస్తుతం ‘ఎ బి సి డి ‘ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం హైదరాబాద్ లోని ఫిలిం నగర్ టెంపుల్ లో ఈ చిత్రానికి పూజ కార్యక్రమాలు నిర్వహించి తొలి సన్నివేశాన్ని చిత్రీకరించారు. అలాగే శిరీష్ తొలి సారి తమిళ స్టార్ హీరో సూర్య తో కూడా ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఇది సూర్య కి 37 వ చిత్రం కావటం విశేషం. అయితే ఈ రోజు అల్లు శిరీష్ తన అఫిషియల్ ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా నేను సూర్య 37 సినిమా నుండి తప్పుకుంటున్నట్లు తెలిపారు.
దానికి ప్రధాన కారణం డేట్స్ కుదరకపోవటమే అని చెప్పారు శిరీష్. సూర్య సినిమాకి తన సినిమా ‘ఎ బి సి డి ‘ కి డేట్స్ క్లాష్ అవుతున్నాయి కావున నేను స్వచ్చంధంగా ఈ సినిమా నుండి తప్పుకుంటున్న అని ట్విట్టర్ ద్వారా తెలిపారు. అప్పటికే సినిమాకి సంబంధించిన భారీ సెట్స్ ని వేసిన కారణంగా డేట్స్ సర్దుపాటు చేయడం కూడా కుదరటంలేదని, డైరెక్టర్ కే వి ఆనంద్ గారు కూడా ఈ విషయాన్నీ అర్ధం చేసుకుని సహకరించినందుకు థాంక్స్ అని ట్వీట్ చేసారు శిరీష్. త్వరలోనే మీ అందరితో మళ్లీ కలిసి నటించే అవకాశం వస్తుందని ఆశిస్తున్నా అని ముగించారు.
Note regarding my role in #Suriya37. pic.twitter.com/scoumeIAlI
— Allu Sirish (@AlluSirish) July 20, 2018