స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘పుష్ప’. ఈ పాన్ ఇండియా ఫిల్మ్ రెండు పార్ట్స్‌గా రాబోతున్నది. ‘పుష్ప: ది రైజ్-పార్ట్ 1’ ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతుండగా, అప్పుడే సినిమా ప్రమోషన్స్‌ను షురూ చేశారు మేకర్స్. సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘దాక్కో దాక్కో మేక’ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ నెల 13న సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేస్తూ ప్రోమోను రిలీజ్ చేశారు.
ఈ ప్రోమోలో బన్నితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీ కూడా కనిపించారు. ఈ పాటను ఐదు భారతీయ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాలో బన్నికి జోడీగా క్యూట్ బ్యూటీ రష్మిక మందన నటిస్తోంది. ఈ సినిమాలో విలన్‌గా మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫజిల్ నటిస్తున్నారు. ఇక ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ ప్రోమో సాంగ్ నెట్టింట వైరలవుతోంది.