ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీల కు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆయన బహిర్గతం చేస్తూ పాపులారిటీ దక్కించుకుంటున్నారు. ఇదివరకే సమంత, నయనతార, కృతి శెట్టి, రష్మిక మందన్న లాంటి హీరోయిన్లకు సంబంధించి జాతకాలు బయటపెట్టారు. మరొకవైపు ప్రభాస్ తో పాటు మరికొంతమంది హీరోల జాతకాలను బయటపెడుతూ అభిమానులను కలవర పెడుతున్నారు. ఇదిలా ఉండగా గత రెండు నెలల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ యూట్యూబ్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ.. త్వరలోనే 45 సంవత్సరాల లోపు మేషరాశికి చెందిన యంగ్ హీరోయిన్ , వృశ్చిక లేదా మిధున రాశికి చెందిన యంగ్ హీరో చనిపోతారు.. అది కూడా ఆత్మహత్య లేదా నాచురల్ డెత్ అవ్వచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే అప్పట్లో ఆ వార్తలు బాగా వైరల్ అయినప్పటికీ కూడా చాలామంది వాటిని కొట్టి పారేశారు. అయితే ఇప్పుడు 40 సంవత్సరాలు కూడా నిండకుండానే యంగ్ హీరో తారకరత్న గుండెపోటుతో మరణించడంతో వేణు స్వామి చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారుతున్నాయి.. వేణు స్వామి చెప్పినట్టుగానే టాలీవుడ్ కి చెందిన 40 సంవత్సరాల లోపు యువ హీరో మరణించడం ఇండస్ట్రీని కలచి వేస్తోంది.. ఇప్పుడు తారకరత్న మరణంతో వేణు స్వామి మాటలు నిజమయ్యాయి. మరి ఆ యువ హీరోయిన్ ఎవరా అని ప్రతి ఒక్కరిలో ఆందోళన కూడా మొదలయ్యింది
సెలబ్రిటీల విషయంలో వేణు స్వామి చెబుతున్న వ్యాఖ్యలు దాదాపు నిజమవుతున్నాయని చెప్పాలి. ఇదివరకే నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటారని చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు.. కానీ అందుకు తగ్గట్టుగానే వారు కూడా విడాకులు తీసుకొని విడిపోయారు. ఇప్పుడు రష్మిక మందన్న, కృతి శెట్టి కెరియర్లు బాగుపడడానికి హోమం చేశానని తెలిపారు.. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఏదేమైనా సెలబ్రిటీలు ఆస్ట్రాలజర్ పై ఆధారపడుతున్నారని చెప్పవచ్చు.