అడవి శేషు.. హిట్-2 తో మెస్మరైజింగ్ చేస్తారా..గ్లింప్స్ వైరల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా HIT ఈ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు తాజాగా HIT-2 కు సంబంధించి ఒక అప్ డేట్ ను విడుదల చేయడం జరిగింది. అయితే ఈ సినిమాలో అందరి హీరోగా విశ్వక్ సేన్ నటిస్తారని అనుకున్నారు.కానీ నిన్నటి రోజున హీరో అడవి శేషు బర్త్డే కావడంతోHIT-2 సినిమాకు సంబంధించి ఒక ఈ వీడియోని విడుదల చేసి అందరికీ షాక్ ఇచ్చారు.

ప్రస్తుతం హీరో అడవి శేషు HIT-2, మేజర్ వంటి సినిమాలలో బిజీగా ఉన్నారు. ఇక నిన్నటి రోజున హీరో నాని తో కలిసి ఈ వీడియోని విడుదల చేయడం జరిగింది. ఇక ఇందులో కేవలం మ్యూజిక్ తో వీడియోని విడుదల చేశారు. ఇక ఈ వీడియో విషయానికి వస్తే.. ఇందులో అడవి శేషు తో పాటుగా ఒక కుక్క కూడా ఉన్నది. ఇక ఈ సినిమాలో దీనికి కూడా చాలా ప్రాముఖ్యత ఉండేటట్లు కనిపిస్తోంది. ఇక దీనిలో కూడా అడవిశేషు పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ఇది వరకు మొదటి సినిమాని తెలంగాణ లో తీయగా.. ఈ సీక్వెల్ సినిమాని ఆంధ్రప్రదేశ్ లో తీస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా హీరో అడవి శేషు అన్ని విభిన్నమైన పాత్రల్లో ఉండే కథలనే ఎంచుకుంటున్నారు

Share.