ప్రముఖ నటి ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ నటి విద్యు రామన్ ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యారు. 2012 లో విడుదలైన ఈ చిత్రం లో ఒక కామెడీ రోల్ చేసింది విద్యు రామన్, అటు తర్వాత వరుసగా తెలుగు సినిమాలలో లేడీ కమెడియన్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నారు. సరైనోడు, డీజె, ఆచారి అమెరికా యాత్ర వంటి హిట్ చిత్రాలలో కూడా నటించారు. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టీవ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటారు. అయితే అనుకోని విధంగా ఈ రోజు తన ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని తనే ట్విట్టర్ ద్వారా తెలిపారు.

అకౌంట్ హ్యాకింగ్ అనేది ఒక పెద్ద సమస్యలా తయారైంది, ” ఒక వింత మరియు భయంకరమైన సంఘటన జరిగింది. విద్యు రామన్ అని ఉండే నా ఫేస్ బుక్ పేజీ హ్యాక్ అయ్యింది.” అంటూ ట్వీట్ చేసింది విద్యు. తన పేరు ని మర్చి రమ్య అని ఫోటో పెట్టారు హ్యాకర్ అని పేర్కొంది. ఇప్పుడు తన 443K ఫాలోయర్లు పరిస్థితి ఏంటని ఫేస్ బుక్ ని ప్రశ్నించింది.

తను తప్ప ఇంకెవరు తన ఫేస్ బుక్ అకౌంట్ ని వాడారని, మరి ఈ ఘటన ఎలా జరిగిందో అర్ధం కావటం లేదని, నిందితుడిని పట్టుకోవాలని సైబర్ క్రైమ్ వారిని కలిసి ఈ విషయం తెలియ చేస్తానని చెప్పారు విద్యు.
ఫేస్ బుక్ ఈ ఘటన పై త్వరగా స్పందించి తనకి తక్షణం ఏదో ఒక పరిష్కారం చూపాలని కోరింది.

Share.