ఆ అమ్మాయితో ప్రేమలో పడి.. పెళ్లి పీటలు ఎక్కబోతున్న దేవిశ్రీ..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ సంగీత దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దేవిశ్రీప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన తన చిన్న వయసులో నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలకు మ్యూజిక్ అందించే అవకాశం దక్కించుకున్నాడు. దీంతో ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు పొందారు. ఈయన సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిచాలా కాలం అవుతున్నా..ఇంకా సింగిల్ గానే ఉన్నారు. అయితే గత సంవత్సరం దేవిశ్రీప్రసాద్ వివాహం పై పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

దేవిశ్రీప్రసాద్, ఛార్మి మధ్య ఏదో ప్రేమ వ్యవహారం నడుస్తోందని అప్పట్లో వార్తలు వినిపించాయి . ఇలా సోషల్ మీడియాలో కూడా ఎన్నో విషయాలు వీరిద్దరి గురించి చక్కర్లు కొట్టాయి. అయితే కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్య దూరం బాగా పెరిగి పోయినట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఛార్మి..దేవి కి దూరమైన తర్వాత దేవిశ్రీ ప్రసాద్ పూర్తిగా తన దృష్టిని సినిమాలవైపు పెట్టాడు.

ఇదిలా ఉండగా తాజాగా దేవిశ్రీప్రసాద్ పెళ్లి గురించి ఒక వార్త వైరల్ గా మారుతోంది. దేవి శ్రీ ప్రసాద్ ఒక తమిళ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ తో ప్రేమలో ఉన్నట్లు.. ఒక వార్త సోషల్ మీడియాలో బాగా బహిరంగం అవుతోంది. ఈ క్రమంలోనే దేవిశ్రీప్రసాద్ ఆ హీరోయిన్ ని ప్రేమించి వివాహం చేసుకోబోతున్నారని వార్త కూడా వస్తోంది. అయితే ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియాల్సి ఉంది.

Share.