పునర్నవి భూపాలం నటిక చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ సోషల్ మీడియాలో చెప్పుకోదగ్గ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. మొదట ఉయ్యాల జంపాల సినిమాలో సునీత పాత్రలో అద్భుతంగా నటించింది పునర్నవి.ఈ సినిమాతో మంచి క్రేజ్ రావడంతో ఆ తర్వాత మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలో కూడా నటించే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత పిట్టగోడ వంటి సినిమాలో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా కూడా మంచి పేరు తెచ్చి పెట్టింది. దీంతో బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని అందుకుంది పునర్నవి.
ఇక తర్వాత పలు వెబ్ సిరీస్లలో నటించిన ఈమె తాజాగా తన ఆరోగ్య సమస్యల గురించి తెలియజేసింది. బిగ్ బాస్ -3 లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ పలు సందర్భాలలో బోల్డ్ కామెంట్లు చేయడంతో తరచూ వార్తలలో నిలుస్తూ ఉండేది. ప్రస్తుతం లండన్ లో సైకాలజీ లో హైయర్ స్టడీస్ చదువుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే కొద్ది రోజుల క్రితం అనారోగ్య బారిన పడినట్లుగా తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ విషయం అభిమానులతో పంచుకున్నది పునర్నవి.
అయితే ప్రస్తుతం తాను ఊపిరితిత్తులకు సంబంధించి సమస్యతో బాధపడుతున్నట్లుగా తెలియజేసింది అనారోగ్య సమస్యతో తన కొత్త సంవత్సరం మొదలైందని పునర్నవి తెలియజేస్తోంది. ఈ మధ్యకాలంలో అనారోగ్యం బారిన పడడం ఇదే మొదటిసారి ఇదే చివరిసారి కూడా కావాలని కోరుకుంటున్నట్లు తెలియజేసింది. పునర్నవి త్వరగా ఆరోగ్య సమస్య నుంచి కోరుకోవాలని ఆమె అభిమానులు కూడా భావిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో సినిమా ఆఫర్లతో బిజీగా కావాలని ఈమె అభిమానులు కోరుకుంటున్నారు. ఈమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని అభిమానులు కాస్త నిరుత్సాహంతో ఉన్నారు.