ఇండస్ట్రీలో ఎక్కువగా సెంటిమెంట్లను నవ్వుతూ ఉంటారు నటీనటులు. ఇక ఈ సినిమా ఈ ముహూర్తానికి పూర్తి చేసుకుంటే సక్సెస్ అవుతుందనే నమ్మకం పెట్టుకుంటూ ఉంటారు. అలా సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఎక్కువగా సెంటిమెంట్లు నమ్ముతూ ఉంటారు. అందుచేతనే డైరెక్టర్, ప్రొడ్యూసర్ వంటి వారు కచ్చితంగా సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు అదే సెంటిమెంట్ దగ్గర నాగార్జున లాక్ అయ్యారనే వార్త వినిపిస్తోంది.
తాజాగా బంగార్రాజు సినిమా లో నాగార్జున తన కుమారుడు నాగచైతన్య నటిస్తున్న విషయం అందరికీ తెలుసు. ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య బంగార్రాజు గా కనిపించబోతున్నాడట. ఇక ఈ సినిమాని జి స్టూడియోస్, నాగార్జున కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నది. ఈ సినిమాని సంక్రాంతి బరిలోనే జనవరి 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నాగార్జున 2016లో సోగ్గాడే చిన్నినాయన సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేశారు. ఇక అదే సెంటిమెంట్ నే ఇప్పుడు కూడా ఫాలో అవుతూ ఈ సినిమా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేదీని రెండు రోజుల లోపల అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నది.