కరోనా బారిన పడిన మరో హీరో..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తమిళ సినిమా ఇండస్ట్రీలో అత్యుత్తమ నటన ప్రదర్శించిన వారిలో హీరో విక్రమ్ కూడా ఒకరు. ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. తాజాగా హీరో ఇటీవల కరొనా బారిన పడినట్లు తెలుస్తోంది. ఈయనకు ప్రస్తుతం 55 సంవత్సరాలు. తన కుమారుడితో కలిసి తాజాగా ఒక సినిమాలో నటిస్తున్నాడు విక్రమ్. అయితే ఇటీవల రెగ్యులర్ షూటింగ్ లో బిజీగా ఉన్న విక్రమ్.. హఠాత్తుగా కొంత అస్వస్థతకు గురైనట్లు గా అనిపించింది. దాంతో వెంటనే తన పర్సనల్ డాక్టర్ను పిలిపించుకొని వైద్య పరీక్షలు నిర్వహించారట.

నీరసంగా ఉండడంతో పాటు జ్వరం కూడా ఉందని తెలియడంతో వైద్యులు కరుణ పరీక్షలు నిర్వహించారు. ఆ వెంటనే విక్రమ్ అన్న క్వారంటైన్ లోకి తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక గత వారం రోజుల నుంచి విక్రమ్తో చాలా దగ్గరగా ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని విక్రమ్ వెంటనే వారిని హెచ్చరించారట. ఇక తన కొడుకు ధ్రువ్ తో ప్రస్తుతం మహాన్ అనే సినిమా లో చేస్తున్నాడు. ఈ సినిమాకి కార్తీక సుబ్బరాజు డైరెక్టర్ గా ఉన్నారు. ఇక వీరిద్దరూ కలిసి నటించడం ఇదే మొదటి సారి.

Share.