‘ప్రతిరోజూ పండగే’ ఫస్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. దూసుకుపోతున్న సాయి..

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ `ప్రతిరోజూ పండగే`. డైరెక్టర్ మారుతీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిత్రలహరి ముందు వరకు సాయిధరమ్ తేజ్ వరుస ఫ్లాపులతో సతమతమయ్యాడు. ఇక చిత్ర‌ల‌హ‌రి హిట్ అవ్వ‌డంతో స‌క్సెస్ ట్రాక్ ఎక్కాడు సాయి. యి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ప్రతిరోజూ పండగే. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మించారు.

డిసెంబర్ 20న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. తొలి షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలయింది. ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌‌గా మారుతి తెరకెక్కించిన ఈ చిత్రానికి రానురాను వసూళ్లు ఇంకా పెరుగుతాయని ఆశిస్తున్నారు దర్శక నిర్మాతలు. నైజాంలో సాయి తేజ్‌కు ఉన్న మార్కెట్ మరోసారి ప్రూవ్ అయింది. ఇక్కడ బాలయ్య రూలర్ సినిమాను పూర్తిగా డామినేట్ చేస్తున్నాడు సాయి. మొదటి రోజు తర్వాత సెకండ్ డే తగ్గినా మూడవ రోజు మాత్రం మొదటి రోజుకి ఈక్వల్ గా కలెక్ట్ చేసింది.

దాంతో ఫస్ట్ వీకెండ్ కూడా ఈ ‘ప్రతిరోజూ పండగే’కి అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. సుమారు 18 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమాకి మొదటి మూడు రోజుల్లో 9.1 కోట్ల షేర్ సాధించి సూపర్బ్ అనిపించుకుంది. ఏదేమైనా మూడు రోజుల థియేట్రికల్ రన్ లో టికెట్ కౌంటర్లలో ఆకట్టుకునే గణాంకాలనే నమోదు చేసింది. డీసెంట్ టాక్ ఉండటం.. క్రిస్మస్ హాలీవుడ్ కలిసిరావడంతో వీకెండ్ అయ్యేనాటికి వసూళ్లు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నారు మేకర్స్. యాసిడ్ టెస్ట్ లాంటి వీక్ డే అయినా సోమవారాన్ని క్రాస్ చేస్తే ఈ ప్రతిరోజూ పండగే సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కి పండ‌గే అని చెప్పాలి.

‘ప్రతిరోజూ పండగే’ ఫస్ట్ వీకెండ్ ఆంధ్ర – తెలంగాణ కలెక్షన్స్:

నైజాం- 3.84 కోట్లు

సీడెడ్- 1.11 కోట్లు

గుంటూరు- 65.5 లక్షలు

ఉత్తరాంధ్ర- 1.35 కోట్లు

తూర్పు గోదావరి- 68 లక్షలు

పశ్చిమ గోదావరి- 52.5 లక్షలు

కృష్ణా- 62.5 లక్షలు

నెల్లూరు- 34 లక్షలు
————————————————–
ఫస్ట్ వీకెండ్ మొత్తం షేర్- 9.12 కోట్లు
————————————————–

Share.