స్వీటీ అనుష్క ఈమధ్య సినిమాలు బాగా తగ్గించేసింది. బాహుబలి పార్ట్ 2, భాగమతి రెండు సినిమాల తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి నిశ్శబ్ధం అనే సినిమా చేసింది. రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాను జనవరి 24న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. హేమంత్ మధుకర్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో అనుష్కతో పాటుగా మాధవన్, షాలిని రెడ్డి కూడా నటిస్తున్నారు.
కోనా ఫిల్మ్ కార్పొరేషన్ లో ఈ మూవీని కోన వెంకట్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన మరో క్రేజీ న్యూస్ ఏంటంటే కోనా వెంకట్ ఈ సినిమాను రెండు పార్టులుగా చేస్తున్నాడట. ఆ విషయం చాలా సీక్రెట్ గా ఉంచుతున్నట్టు తెలుస్తుంది. సినిమా షూటింగ్ మధ్యలోనే రష్ చూసి కథని రెండు భాగాలుగా పొడిగిస్తే బెటర్ అని అనుకున్నాడట. ఒక సినిమాకు పెట్టే బడ్జెట్ తో రెండు సినిమాలు చేస్తే బిజినెస్ పరంగా కూడా లాభాలు ఉంటాయని అలా ఫిక్స్ అయ్యాడట.
సినిమా మొత్తం యూరప్ బ్యాక్ డ్రాప్ లోనే జరుగుతుంది. సినిమాలో అనుష్క డెఫ్ అండ్ డం రోల్ లో నటిస్తుంది. తప్పకుండా ఈ సినిమాలో అనుష్క పర్ఫార్మెన్స్ కు ప్రత్యేకమైన గుర్తింపు వస్తుందని అంటున్నారు. సినిమా అంతా అనుష్క తన భుజాన వేసుకుని చేస్తుందని తెలుస్తుంది. నిశ్శబ్ధం హిట్టైతే మాత్రం నిశ్శబ్ధం 2కి క్రేజ్ పెరుగుతుంది.