హీరోయిన్ కొంప ముంచిన సోషల్ మీడియా… బాయ్ ఫ్రెండ్‌తో కొత్త తలనొప్పి…!

Google+ Pinterest LinkedIn Tumblr +

దిశ పటాని… ప్రస్తుతం ఈ సన్న నడుం చిన్నది సోషల్ మీడియాలో హాట్ టాపిక్… గత ఏడాది దీపావళి సందర్భంగా… తన బ్రాండ్ ప్రమోషన్ లో భాగంగా ఈమె దీపావళి శుభాకాంక్షలు చెప్పిన తీరుకి కుర్ర కారు ఊగిపోయింది. తమ సెల్ ఫోన్స్ లో… ల్యాప్ టాప్ లో, సోషల్ మీడియాలో ప్లాట్ ఫార్మ్స్ మీద ప్రొఫైల్ పిక్చర్స్ గా ఆమెకు పెట్టుకున్నారు. ఇక అప్పటి నుంచి దిశా కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె ఫోటో పెట్టింది అంటే చాలు అభిమానులు వేలల్లో క్షణాల్లో లైకులు కొడుతూ ఆమె మీద అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక అప్పటి నుంచి ఆమె క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఆమె బ్రాండ్ వాల్యు కూడా మార్కెట్ లో విపరీతంగా పెరిగిపోయింది. ఆమె ఎక్కడైనా షూటింగ్ కి వెళ్తున్నా సరే అక్కడికి అభిమానులు భారీగా వస్తూ ఆమె ఫోటో కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలకు మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఇప్పుడు ఇదే ఆమెకు ఇబ్బందిగా మారింది అంటున్నాయి సిని వర్గాలు. ఇటీవల ఒక సినిమా షూటింగ్ కోసం ఆమె వెళ్ళగా చాలా మంది అభిమానులు ఆమె వెంట పడ్డారు.

ఇక తన బాయ్ ఫ్రెండ్ తో ఎక్కడికి అయినా వెళ్ళినా సరే ఈ విధంగానే అభిమానులు ఆమె వెంట పడ్డారట. ఇక వాళ్లకు ప్రైవేటు స్పేస్ అనేది లేకుండా పోయిందని ఆమె బాయ్ ఫ్రెండ్ జాకీ ష్రాఫ్ బాధ పడుతున్నాడు. ఆ బ్రాండ్ ని నువ్వు వదిలెయ్యాలని ఆమెకు ఇప్పటికే చెప్పాడట. సోషల్ మీడియాలో కూడా ఫోటోల విషయంలో జాగ్రత్త గా ఉండాలని, వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బంది పెట్టేలా అయితే వద్దని చెప్పాడట. ఇక పదే పదే ఆమె తన ఫాలోయింగ్ ని చూసుకుంటూ సోషల్ మీడియాలో ఎక్కువగా గడపడం కూడా అతనికి నచ్చడం లేదట. ఈ మధ్య వీరికి సోషల్ మీడియా కారణంగా గొడవలు కూడా అవుతున్నాయని సిని వర్గాలు అంటున్నాయి.

Share.