అనుపమ – ప్రకాష్ రాజ్ గొడవ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, హీరో రామ్ జంటగా నటిస్తున్న ‘హలో గురూ ప్రేమ కోసమే’ సినిమా లో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఒక ముఖ్యమయిన పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం ప్రకాష్ రాజ్, అనుపమ్ మధ్య వచ్చే సన్నీ వేశాల కోసం ఒక షాట్ షూట్ చేస్తున్న టైం లో ప్రకాష్ రాజ్ అనుపమ ను బాగా తిట్టినందుకు అనుపమ రోజంతా ఏడుస్తూనే ఉందని, బాగా ఏడవటం వల్ల నీరసం వచ్చి సెట్ లోనే పడిపోతే హాస్పిటల్ కి కూడా తీసుకెళ్లారనే వార్త సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది.

అయితే ఇదంతా చూసి అనుపమ దీనికి ఫులిస్టాప్ పెట్టాలనే ఉద్దెశం తో తను, ప్రకాష్ రాజ్ కలసి సరదాగా వున్నప్పుడు దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయినప్పటికీ ఈ రూమర్స్ ఇంకా ఆగకపోవటం తో దర్శకుడు త్రినాథరావు నక్కిన అసలు ఆ రోజు జరిగింది ఏమిటో వివరించే ప్రయత్నం చేశాడు. అనుపమ హాస్పిటల్ కి వెళ్లిన మాట వాస్తవమేనని, దానికి కారణం షూటింగ్ లో బాగా అలసిపోవడం దానికి తోడు ఫుడ్ ఇన్స్పెక్షన్ కావటం వల్లనే స్టూడియోలోనే ఉన్న ఆసుపత్రికి ఆమెను తీసుకెళ్లామని చెప్పాడు త్రినాథరావు. నిజానికి ఆ రోజుతో ప్రకాష్ రాజ్ డేట్లు అయిపోతుండటంతో.. ఆయన కాంబినేషన్లో తీయాల్సిన సీన్ల కోసం అనుపమ మళ్లీ సెట్ కు వచ్చిందని.. ప్రకాష్ రాజ్ వద్దని వారించినా వినకుండా ఆయనతో కలిసి షూటింగ్ లో పాల్గొందని.. అంతే తప్ప వాళ్ల మధ్య ఎలాంటి గొడవా జరగలేదని ఆయన స్పష్టం చేశాడు. మరి దర్శకుడు అంత క్లియర్ గా వివరణ ఇచ్చాక అయినా ఈ ప్రచారం ఆగుతుందేమో చూడాలి.

Share.