ఈ రోజు ఉదయం విజయవాడ గవర్నరుపేట లో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరం లో సంచలనం సృష్టించింది. సదరు యువకుడిని పోలీసులు దర్శి వంశీ కృష్ణ అని, గుంటూరు జిల్లాకి చెందిన వ్యక్తని తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం వంశి విజయవాడ లోని ఒక ప్రైవేట్ కంపెనీ లో సేల్స్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నారు. అయితే సుమారు రెండు రోజుల క్రితం ఆలీబేగ్ వీధిలోని ఓ లాడ్జిలో ఒక గదిని అద్దెకి తీసుకున్నాడు. నిన్న రాత్రి హోటల్ సిబ్బంది గది లోపల యువకుడిని ఎంత పిలిచినా రాకపోయేసరికి వారు పోలీసులకి తెలియ చేసారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకునే లోపే వంశి ఫ్యాన్ కి ఊరి వేసుకుని ఒక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.
సూసైడ్ నోట్ వివరాలు:
వంశి తాను ఒక అమ్మాయి ని ప్రేమించానని తన వల్లే నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని లేక లో పేర్కొన్నాడు, యువకులందరు ప్రేమ విషయం లో జాగ్రత్త గా వ్యవహరించాలని రాసాడు. ఇంకా తాను నటుడు, జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి అభిమానినని..అయితే పవన్ కళ్యాణ్ ను ఒక్క సారి కూడా చూడలేదు…వచ్చే ఎన్నికల్లో పవన్ విజయం సాధించాలని కూడా తన సూసైడ్ నోట్ లో వంశి రాసుకున్నారు.
పోలీసులు ప్రేమ విషయం విఫలమైనందుకే వంశి సూసైడ్ చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.