మరో సారి అమితాబ్ తో నాగార్జున

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున ప్రస్తుతం నాని తో ఒక బారి మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత నాగ్ తదుపరి చిత్రం ఏమిటనేది ఇంత వరకు తెలియదు, అయితే ఈ రోజు ఉదయం నాగార్జున చాల సంవత్సరాల తర్వాత తిరిగి బాలీవుడ్ లో ఒక చిత్రం లో నటిస్తున్నారని తెలిసిందే. అమితాబ్‌ బచ్చన్‌, ఆలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మాస్త్రా’ ఈ మూవీ లో నాగార్జున ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘బ్రహ్మాస్త్రా’ కథ నచ్చడంతో నాగ్ ఈ చిత్రంలో నటించటానికి ఒప్పుకున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈరోజు నుంచి ముంబయిలో జరగబోయే షూటింగ్ లో అమితాబ్ తో పాటుగా నాగార్జున కూడా కలిసి కొన్ని కీలక సన్నివేశాలలో నటించనున్నారని టాక్.
గతంలో అమితాబ్ నటించిన ‘ఖుదా గవా’ చిత్రంతో పాటు ‘జఖమ్‌’, ‘అగ్ని వర్ష’, ‘ఎల్‌వోసీ కార్గిల్‌’ చిత్రాల్లో నాగార్జున కొన్ని ముఖ్యమైన పాత్రల్లో నటించారు. అక్కినేని నాగేశ్వర్ రావు చివరి చిత్రం ‘మనం’ లో అమితాబ్ ఒక ముఖ్య పాత్ర చేసిన విషయం తెలిసిందే. ఈ వార్త తెలియగానే అక్కినేని అభిమానుల ఆనందానికి అడ్డే లేకుండా పోయింది.

Share.