ఇది అసలు ఊహించలేదు: సోనాలి బింద్రే

Google+ Pinterest LinkedIn Tumblr +

ఒకప్పటి స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రేకి క్యాన్సర్ వ్యాధి సోకిందట. ఈ విషయాన్ని ఆమె వెళ్లడించడం జరిగింది. అస్వస్థతగా ఉన్న కారణంగా హాస్పిటల్ కు వెళ్లగా అక్కడ డాక్టర్స్ తనకు క్యాన్సర్ ఉందని నిర్ధారించారని.. వ్యాధిని గుర్తించా కాబట్టి దీనికి సరైన ట్రీట్ మెంట్ తీసుకోవడం తప్పనిసరి. అందుకే ప్రస్తుతం క్యాన్సర్ కు సంబందించిన ట్రీట్ మెంట్ న్యూయార్క్ లో తీసుకుంటున్నట్టు వెళ్లడించారు సోనాలి బింద్రే.

కుటుంబ సభ్యులు, స్నేహితులు నా పై చూపిస్తున్న ప్రేమ గొప్పగా అనిపిస్తుంది. వారితోనే దీనిపై బలంగా పోరాడుతాను అంటూ తన వ్యాధి గురించి స్వయంగా చెప్పి అందరికి షాక్ ఇచ్చింది సోనాలి బింద్రే. తెలుగు, తమిళ, హింది భాషల్లో స్టార్స్ తో సినిమాలు చేసిన సోనాలి బింద్రేకు క్యాన్సర్ వ్యాధి సోకడం దురదృష్టకరమని చెప్పాలి. విషయం తెలిసినప్పటి నుండి సోనాలి ఫ్యాన్స్ ఆమె మళ్లీ తప్పకుండా మాములు మనిషి అవుతుందని.. దేవుడు ఆమెపై కరుణ చూపించి ఆశీర్వధించాలని మెసేజ్ చేస్తున్నారు.

Share.