దివంగత ముఖ్య మంత్రి, మహా నేత శ్రీ వైఎస్సాఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచినా మహా నాయకుడు. రాష్ట్ర రాజకీయాలలో వైఎస్సాఆర్ సృష్టించిన ప్రభంజనం అంత ఇంత కాదు. అయితే తాజాగా అయన జీవిత కథ ఆధారంగా దర్శకుడు మహి వి.రాఘవ్ “యాత్ర” అనే సినిమా తీస్తున్నారని ఇటీవలే ప్రకటించారు. ఇందులో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి టైటిల్ రోల్ పోషిస్తున్నారని చిత్ర బృందం అఫిషియల్ గా ఇది వరకే ప్రకటించింది. ఇది ఇలా ఉండగా ఈ రోజు ఉదయం నుండి ఒక వార్త సినీ ఇండస్ట్రీ లో జోరుగా చెక్కర్లు కొడుతుంది, అదే ఈ సినిమాలో ప్రముఖ యాంకర్ ‘అనసూయ’ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారట.
అనసూయ కర్నూలు జిల్లాకు చెందిన రాజకీయ నాయకురాలిగా కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమా వైఎస్సాఆర్ చేసిన పాదయాత్ర పై ఎక్కువగా ఫోకస్ చేయనుందని టైటిల్ ద్వారా తెలుస్తుంది, కావునా అనసూయ కూడా ఈ మహా యాత్రకి బయలుదేరనుందన్నమాట. ఇటీవలే రంగస్థలం లో రంగమ్మత్త గా అభిమానులని మెప్పించిన అనసూయ ఈ సినిమాలో ఎలా నటిస్తుందో వేచి చూడాల్సిందే. ఈ బయోపిక్ లో వైఎస్సార్ సన్నిహితుడు కేవీపీ రామచంద్ర రావు పాత్రని నటుడు రావు రమేష్ పోషిస్తున్నారని సమాచారం. 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై విజయ్ చిల్ల, శశి దేవిరెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.