టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్.. పుష్ప సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఇంకా ఎక్కువగా ఆకట్టుకున్నాడని చెప్పవచ్చు. అయితే అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప-2 ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే మొదటి సినిమాకు జాతీయ అవార్డు రావడంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో దాదాపుగా 400 కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చాయి.. అందుకే రెండో భాగానికి ఏకంగా 1000 కోట్ల కలెక్షన్ వస్తాయి అంటూ చాలా నమ్మకంగా చిత్ర యూనిట్ సభ్యులతో పాటు ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కానీ పుష్ప-2 సినిమా మాత్రం ఆలస్యం అవుతూనే ఉంది. ఈ ఏడాదైనా రిలీజ్ అవుతుంది అనుకుంటే వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేసి 2024 ఆగస్టు 15న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇక సినిమా షూటింగ్ విషయానికొస్తే ప్రత్యేకంగా వేసిన సెట్టింగ్స్ లో షూటింగ్ జరుగుతోందట .ఇందులో జాతరకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నట్లు వార్త వినిపిస్తున్నాయి ఇక దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకి అలాగే ఈ జాతర సీన్ కి ఏకంగా 15 నుండి 20 కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారు అంటూ సమాచారం l.
అయితే చాలా మంది ఈ బడ్జెట్ కి మీడియం సినిమాలు రెండు మూడు తీయొచ్చు అంటు కామెంట్స్ చేస్తున్నారు మరికొందరు 1000 కోట్ల సినిమాకు ఆ మాత్రం ఖర్చు పెట్టకుండా ఎలా అని అల్లు అర్జున్ అభిమానులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాని హిందీతో పాటు అన్ని భాషలలో కూడా కొనుగోలు చేసేందుకు భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారట. ముఖ్యంగా హిందీ మరియు ఇతర భాషలకు సంబంధించిన రైట్స్ కోసం పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. అందుకే ఈ సినిమాకి 1000 కోట్ల వరకు కలెక్షన్స్ రాబడుతుందని మీడియా లో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.