తొలి తెలుగు స్వాతంత్య్ర సమర యోధుడు అయిన కర్నూలు జిల్లాకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సురేందర్రెడ్డి తెరకెక్కించిన చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండు వందల యాభై కోట్ల భారీ బడ్జెడ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ అవుతున్న సైరా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయి భారీ అంచనాలతో దూసుకుపోతోంది.
సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో సైరాకు భారీ ఎత్తున ప్రి రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. కేవలం థియేట్రికల్ రైట్స్ రు. 190 కోట్లకు అమ్ముడయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో నెగిటివ్ టాక్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. వాస్తవానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిషర్లు చాలా దారుణంగా హింసించి ఉరి తీసి తలను వేలాడ తీశారు. ఇది నర్సింహారెడ్డి చరిత్రలో ఒక భాగం. అక్కడితో ఆయన కథ ముగిసింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చారిత్రాత్మక సినిమా కావడంతో సురేందర్ రెడ్డి ఈ రియల్ క్లైమాక్స్ ను అలాగే కంటిన్యూ చేసినట్టు తెలుస్తోంది.
ఆయనను ఉరి తీసి 30 ఏళ్ల పాటు అలాగే తలవేలాడ తీశారు. చరిత్రలో ఎవరు తిరుగుబాటు చేయకుండా ఉండేందుకు… ప్రజలను భయపెట్టేందుకు బ్రిటిషర్లు అలా చేశారని దీనిని బట్టి స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు సినిమాలోనూ చిరంజీవిని ఉరి తీసే సన్నివేశంతో క్లైమాక్స్ ఉంటే మన ప్రేక్షకులు ఎంత వరకు జీర్ణించుకుంటారన్నది సందేహమే. మరో టాక్ ప్రకారం సురేందర్‌రెడ్డి క్లైమాక్స్ విషయంలో అంత బాగా డీల్ చేయలేదని కూడా అంటున్నారు. ఏదేమైనా సైరా క్లైమాక్స్ టాక్ బాగోలేదనే అంటున్నారు. మరి దీనిని రేపు రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు ఎలా ? జీర్ణించుకుంటారో ? చూడాలి.