టాలీవుడ్ లో ఉన్న ప్రతి స్టార్ హీరో కుటుంబం నుండి ఒక్కొక్క హీరో ఉన్నాడు. అయితే దర్శకనిర్మాతలు కూడా అదే బాట పడుతున్నారు. తమ వారసులను వెండితెరకు హీరోలుగా పరిచయం చెయ్యడానికి మక్కువ చూపుతున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఇప్పుడు ఇదేపని చేయబోతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానాకి నిర్మాతగా దిల్ రాజు వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ఆయన బ్యానర్లో ఒక్క సినిమా చేసినా చాలు అని యంగ్ హీరోలు అనుకుంటూ ఉంటారు. అయితే దిల్ రాజు ఆ సారి తన వారసుడునే రంగంలోకి దింపనున్నారు
ఆయన తన సోదరుడు, పార్టనర్ శిరీష్ రెడ్డి కుమారుడు ఆశిష్ రెడ్డిని హీరోగా లాంచ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు సన్నాహాలు గత కొంతకాలంగా జరుగుతున్నాయి. ఆశిష్ రెడ్డి ఇప్పటికే ..వైజాగ్ సత్యానంద్ ఇనిస్టిట్యూట్ లో నటనకు చెందిన కోర్స్ పూర్తి చేసి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆశిష్ రెడ్డిని హీరోగా ఇంట్రడ్యూజ్ చేస్తూ ఇదివరకే సినిమాను లాంఛ్ చేశారు. అలాగే
కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకి పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
ఇప్పుడు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను .. స్క్రిప్ట్ పనులను పూర్తిచేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి ‘రౌడీ బాయ్స్’ అనే టైటిల్ ను ఖరారు చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుందని చెబుతున్నారు. ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.