రూలర్ సినిమాకు ఎన్టీఆర్ ప్రచారం… !

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇక్కడ మెగా ఫ్యామిలీని పొగడటం అని కాదు గాని… ఒక విషయంలో వాళ్ళను అందరూ మెచ్చుకోవచ్చు. అదే వాళ్ళల్లో ఉండే యూనిటీ… పది మంది హీరోలు ఆ కుటుంబం నుంచి సిని పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ పది మంది కూడా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఎవరి సినిమా అయినా విడుదల అవుతుంది అంటే అందరూ ఏదోక విధంగా ఆ సినిమాకు ప్రచారం చేస్తూనే ఉంటారు. ఎన్ని విభేదాలు వాళ్ళల్లో వాళ్లకి ఉన్నా సరే సినిమాను ప్రమోట్ చేయడంలో మాత్రం అలాంటివి ఎక్కడా వాళ్ళు చూపించరు.

అయితే నందమూరి కుటుంబం విషయంలో మాత్రం అది ఎక్కడా కనపడదు… బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఈ కుటుంబం నుంచి హీరోలు గా ఉన్నారు… వీరిలో ఎవరి సినిమా రిలీజ్ అయినా సరే మరో హీరో ఆ సినిమా ప్రమోషన్ లో పాలు పంచుకోరు… కనీసం సినిమా ఆడియో కార్యక్రమానికి కూడా హాజరు కావాలి అంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. ఇప్పుడు బాలకృష్ణ రూలర్ సినిమా విడుదల అవుతుంది.

కెఎస్ రవి కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకి వస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ ఈ సినిమా కోస౦ చాలానే కష్టపడ్డారు. సి కళ్యాణ్ నిర్మాణ సారధ్యంలో వస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్ ట్రైలర్ అభిమానుల్లో సినిమాపై హైప్ పెంచాయి. ఇక్కడ నందమూరి అభిమానులను ఒక ఆలోచన వెంటాడుతుంది… తన బాబాయ్ సినిమాకు ఎన్టీఆర్ కూడా ప్రచారం చేయవచ్చు కదా అని కోరుతున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ లో ఒక సందర్భంలో అయినా తారక్ ప్రచారం చేయవచ్చు కదా అని అభిప్రాయపడుతున్నారు. ఇక బాలకృష్ణ కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్ లో సహకరిస్తే బాగుంటుంది అని కోరుతున్నారు. ఇలా నంద‌మూరి హీరోలు క‌లిసి క‌ట్టుగా ఉంటే అవి వాళ్ల సినిమాల ఓపెనింగ్స్‌, క‌లెక్ష‌న్స్‌కు ఎంతైనా హెల్ఫ్ అవుతాయ‌ని అంటున్నారు.

Share.