నాచురల్ స్టార్ నాని పైకి ఎంత సాఫ్ట్ గా కనిపిస్తాడు.. అష్ట చమ్మ నుండి రీసెంట్ గా వచ్చిన గ్యాంగ్ లీడర్ వరకు నాని మంచి రోల్స్ చేశాడు. అలాంటి నాని సైకోగా మారిపోయాడట. ఏంటి ఇదంతా నిజమే అనుకుంటున్నారు కదా కాదులేండి ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో నాని చేస్తున్న వి సినిమా కోసం నాని విలన్ పాత్రలో చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమాలో నాని సైకోగా కనిపిస్తాడట.
నెగటివ్ రోల్ అన్నారు కాని నాని సైకో పాత్రలో నటించి షాక్ ఇస్తాడట. అష్టా చమ్మ, జెంటిల్ మన్ సినిమాల తర్వాత నాని ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కాబట్టి ఈ సినిమాపై మాములుగానే అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమాలో నానితో పాటుగా సుధీర్ బాబు కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా మార్చ్ 25 ఉగాదికి రిలీజ్ ఫిక్స్ చేశారు.
ఇన్నాళ్లు నానిలోని సాఫ్ట్ కార్నర్ చూసిన ఆడియెన్స్ తనలోని రౌడీయిజం చూపించబోతున్నాడు. ఈ సినిమాతో నాని నట విశ్వరూపం ఏంటో తెలుస్తుందని అంటున్నారు. నానితో పాటుగా సుధీర్ బాబు కూడా పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. మరి యువ హీరోల మల్టీస్టారర్ మూవీగా వస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.