ఐరెన్ లెగ్ కాస్తా గోల్డెన్ లెగ్ అయిందే?

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్ర‌స్తుతం టాలీవుడ్‌ని ఒక ఊపు ఊపేస్తూ హ‌వా కొన‌సాగిస్తుంది ఈ భామ‌. ఒక‌ప్పుడు ఐరెన్ లెగ్‌లా ముద్ర వేయించుకున్న ఈ భామ ఇప్పుడు గెల్డెన్ లెగ్‌గా మారింది పూజా హెగ్డే. ఒక‌ప్పుడు ఐరెన్ లెగ్ అన్న‌వాళ్ళే పూజాను ఇప్పుడు గోల్డెన్ లెగ్ అంటూ అవ‌కాశాలు త‌న వెంట‌ప‌డుతున్నాయి.

ఒకప్పుడు వరుస ఫ్లాపులతో చేతిలో సినిమాలే లేని పరిస్థితి ఎదుర్కొన్న పూజ.. ఇప్పుడు ఏ ప్రాజెక్టును ఒప్పుకోవాలా? అన్నంత బిజీ అయిపోతోంది. తెలుగులోని స్టార్ హీరోలంతా ‘పూజ’ పేరు జపిస్తుంటే.. బాలీవుడ్‌ని టార్గెట్ చేసిన పూజ మొత్తానికి అక్కడ భారీ అవకాశాన్నే అందుకుంది.

బాలీవుడ్‌లో పూజ చేసిన ‘మొహంజొదారో’ డిజాస్టర్ కావడంతో అవకాశాలు తెరమరుగయ్యాయి. చాలా గ్యాప్ తరువాత ‘హౌస్‌ఫుల్ -4’లో అవకాశం అందుకుంది. ఆ సినిమాకు ఓకే అనిపించుకోవడంతో పూజ ఊపిరి పీల్చుకుంది. ఈలోగా తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు పడుతుండటంపై టాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టింది పూజ. ఇప్పుడు వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు పడుతున్న టైంలో బాలీవుడ్‌లో ఏకంగా సల్మాన్‌కు జోడీగా చాన్స్ వచ్చిందట.

సల్మాన్‌తో సాజిద్ నడియావాలా నిర్మించనున్న ‘కబీ ఈద్ కబీ దివాలీ’లో పూజకు గోల్డెన్ ఛాన్స్ తగిలింది. సల్మాన్‌తో పూజ కాంబినేషన్ ఇదే ఫస్ట్‌టైం. ఫర్హాద్ సంజీ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా 2021 ఈద్ కు విడుదలవుతుందని సమాచారం!? మ‌రి పూజా బాలీవుడ్‌లో పెద్ద స్టార్ హీరోతో బుక్ అయిందంటే మాములు మాట‌లు కాదు. మొత్తానికి కెరియ‌ర్‌ని బాగా ముందుకు తీసుకువెళుతుంది.

Share.