ఆ ప‌నికి ఒప్పుకోనందుకే ఛాన్స్ ఇవ్వ‌లేదు… టాలీవుడ్ హీరోయిన్ సంచ‌ల‌నం..

Google+ Pinterest LinkedIn Tumblr +

కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు సౌత్ టు నార్త్ అన్ని సినిమా ఇండస్ట్రీలను ఓ ఊపు ఊపేస్తోంది. ఇప్పుడు ఏ హీరోయిన్ అయినా కాస్టింగ్ కౌచ్ సమస్య గురించి చాలా ఓపెన్ గా చేప్పేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే స్టార్ హీరోయిన్లు సైతం సినిమాల్లో నటించాలంటే చాలా ముందుగా ఈ సమస్యతోనే పోరాడాల్సి వస్తుందని కూడా కుండ‌బ‌ద్ద‌లు కొడుతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ గురించి సినిమాలో ఛాన్స్ కోసం ఎలాంటి ఇబ్బందులు పడ్డామో ఓపెన్‌గానే చెప్పి సంచలనం రేపారు.

ఇక ఇప్పుడు ఈ జాబితాలోకి మరో బాలీవుడ్ హీరోయిన్ కూడా వచ్చి చేరింది. ఆమె ఎవరో కాదు రాంగోపాల్ వర్మ కంపెనీ సినిమా ఐటెం గ‌ర్ల ఇషా. హిందీలో 2000లో వచ్చిన ఫిజా సినిమాతో ఇషా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కంపెనీలో ఖ‌ల్ల‌స్ ఐటెం సాంగ్‌తో ఆమెకు ఎక్క‌డా లేని క్రేజ్ వ‌చ్చేసింది. ఆ బ్రేక్‌తో ఆ త‌ర్వాత ఆమె చాలా సినిమాల్లో న‌టించింది.

ఈ క్ర‌మంలోనే తన జ‌ర్నీలో చేదు అనుభ‌వాలు ఎదుర్కొన్న‌ట్టు చెప్పింది. ఓ సినిమాలో ఆఫ‌ర్ రాగా నిర్మాత హీరోకు కాల్ చేయ‌మ‌ని చెప్పాడ‌ని.. అత‌డు త‌న‌ను ఒంట‌రిగా వ‌చ్చి క‌ల‌వ‌మ‌ని చెప్పాడ‌ని ఇషా చెప్పింది. అక్క‌డ‌కు వెళ్లాక ఆ హీరో త‌న మ‌న‌స్సులో మాట చెప్ప‌డంతో ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చాన‌ని చెప్పింది. ఈ క్ర‌మంలోనే ఆ హీరోతో తాను చేయాల్సిన ఛాన్స్ మిస్ అయ్యింద‌ని… ఆ తర్వాత హీరోతో చనువుగా ఉన్న మరో హీరోయిన్‌కు అవకాశం వచ్చింద‌ని ఇషా తాను ఎదుర్కొన్న అనుభ‌వాలు చెప్పుకొచ్చింది.

Share.