అత్తింటి వేధింపులకు బలైన ప్రముఖ సింగర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కన్నడ పరిశ్రమలో సీరియల్స్ కు కొన్ని సినిమాలకు పాటలు పాడిన సింగర్ సుస్మిత సూసడి ప్రస్తుతం హాట్ న్యూస్ గా మారింది. సింగర్ గా సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్న సుస్మిత సడెన్ గా ఇలా ఉరి వేసుకుని చనిపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. శరత్ అనే కుర్రాడిని ఏడాది క్రితమే పెళ్లాడిన సుస్మిత ఏడాది ముగిసిందో లేదో తన అత్తింటి వేధింపులు భరించలేక పుట్టింటికి వచ్చి అక్కడ ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయింది.

అదనపు కట్నంతో పాటుగా కావాలని ఆమెను అత్తింట్లో వేధించారని సూసైడ్ లెటర్ లో రాసింది సుస్మిత. అత్తని, అత్తింట్లో ఎవరిని వదిలిపెట్టొద్దని.. వాళ్ల వల్లే తను మానసిక క్షోభ అనుభవించానని వాళ్లకి ఎలాగైనా శిక్ష పడేలా చేయాలని సూసడి నోట్ లో రాశారు సుస్మిత. సుస్మిత మరణం పట్ల కేవలం అత్తింటి వేధింపులే కారణమా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పెళ్లై ఏడాదే అవుతున్నా అత్తింట్లో తట్టుకోలేని వేధింపుల వల్ల సుస్మిత ఉరి వేసుకుని తనకు తానే శిక్ష వేసుకుంది. సుస్మిత మరణ వార్త విన్న సీరియల్ మేకర్స్ షాక్ అయ్యారు. ఆమె చాలా మంచి సింగర్ మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశించగా ఇంతలో ఇలాంటి ఘోరం జరిగింది.

Share.