టాలీవుడ్లో స్వయంకృషితో మెగాస్టార్గా ఎదిన నటుడు చిరంజీవి. సిని రంగంలో నా అన్నవారు ఎవరు లేరు. ఆయనను సినిమా పరిశ్రమలో ప్రోత్సహించి నటనలో ఓనమాలు నేర్పినవారు గాని, అవకాశాలు వచ్చేలా చేసిన కుటుంబ సభ్యులు ఎవరు లేరు. అయినా నటనే సర్వసంగా భావించి, తన సత్తా చాటుకుంటూ ప్రాణం ఖరీదు సినిమా పునాదిరాళ్ళు వేసుకుని అంచెలంచెలుగా ఒక్కో మెట్టు ఎక్కుతూ 151వ చిత్రం వరకు తిరుగులేని మెగాస్టార్గా అవతరించాడు చిరంజీవి.
కొణిదెల శివశంకరవరప్రసాద్ కాస్త చిరంజీవిగా రూపాంతరం చెంది ఇప్పుడు టాలీవుడ్నే తన కనుసైగలతో శాసిస్తున్న మహానటుడు మెగాస్టార్. అయితే మెగాస్టార్ తన నటనతో, నాట్యంతో, పైట్లతో ప్రేక్షకులను రంజింప చేసిన చిరంజీవికి అభిమానులు అంతులేని సైన్యంగా మారారు. అందుకే చిరంజీవి సినిమా వస్తుందంటే ప్రత్యేకంగా ఆయన ప్రమోషన్ కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఆనాడు, ఈనాడు ఏనాడు చిరంజీవికి రాలేదంటే అతిశయోక్తి కాదు.
అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి.. ప్రమోషన్ కార్యక్రమం సినిమా మొదలైనప్పటి నుంచి మొదలవుతుంది. అయితే చిరంజీవి ప్రమోషన్ ను ఆయన అభిమానులు తమకు తోచిన విధంగా చేసుకుంటూ పోతూనే ఉంటారు. అయితే ఇప్పుడు సైరా సినిమా విడుదలకు రోజులు దగ్గర పడుతున్న కొద్ది అభిమానం ఎల్లలు దాటిపోయింది. ఇప్పుడు చిరంజీవి ఫీవర్ అందులో సైరా ఫీవర్ అనకాపల్లి నుంచి అమెరికా దాకపాకింది. అందుకు నిదర్శనం ఓలారీ పైన చిరంజీవి సైరా చిత్రంను అప్పుడే ముద్రించుకోవడం అయితే అమెరికాలో ఓ కారుకు నెంబర్ ప్లేట్కు బదులు సైరా అంటూ రాయించుకున్నారు.. అందుకే చిరంజీవికి అభిమానుల అభిమానం ఎల్లలు దాటిందని చెప్పవచ్చు.