సూర్య ‘ బందోబ‌స్త్‌ ‘ గా మునిగిపోయాడా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

అనగనగా ఒక విక్రమ్ ఒక కార్తీ ఒక విశాల్ అని గతమెంతో ఘనంగా ఉన్న తమిళ హీరోల తెలుగు మార్కెట్ వరసలో ఇప్పుడు సూర్య కూడా చేరిపోయాడు. గ‌జినీ, ఆరు సినిమాల త‌ర్వాత సూర్య దూసుకుపోయాడు. ఇక సింగం సీరిస్ సినిమాల త‌ర్వాత సూర్య క్రేజ్ మామూలుగా లేదు. ఇక ఇప్పుడు వ‌రుస ప్లాపుల‌తో సూర్య సినిమాలు తెలుగులో ఓ మోస్త‌రు రేట్ల‌కు కూడా కొనేవాళ్లు లేరు.

మొదటి రోజు మొదటి ఆటకు కనీసం హౌస్ ఫుల్ చేయలేని స్థితికి తెలుగులో సూర్య మార్కెట్‌ పడిపోయింది. రంగం లాంటి టాప్ సినిమా తెర‌కెక‌కించిన కెవి.ఆనంద్ సినిమాయేనా ? అన్న సందేహాలు వ‌చ్చేలా ఈ సినిమా ఉంది. మోహన్ లాల్ -ఆర్య – సాయేషా – సముద్ర‌ఖని ఇలా సపోరింగ్ క్యాస్ట్ ఎంత ఉన్నా వీక్ కంటెంట్ వల్ల కోట్ల రూపాయల బడ్జెట్ వృధా అయిపోయింది.

ఒక‌ప్పుడు సూర్య‌కు తెలుగులో రూ.30 కోట్ల మార్కెట్ ఉంటే అది ఇప్పుడు కేవ‌లం రూ.5 కోట్ల‌కే ప‌డిపోయింది. గ‌తంలో తెలుగు మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడానికి కూడా వెనుకాడలేదు. ఇక సూర్య వ‌రుస‌గా క‌థ‌ల ఎంపిక‌లో చేస్తోన్న త‌ప్పుల‌తోనే వ‌రుస‌గా భారీ డిజాస్ట‌ర్లు ఎదుర్కొంటున్నాడు. ఇక బందోబ‌స్త్‌కు తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌నీసం థియేట‌ర్ల రెంట్లు కూడా రాలేదంటున్నారు.

ఇక గ‌తంలో తెలుగులో భారీ మార్కెట్ ఉన్న కోలీవుడ్ హీరోలు విక్రమ్, కార్తీ సైతం కూడా ఇదే తరహాలో ఇక్కడ తమ ఇమేజ్ బిజినెస్ ని చాలా దారుణంగా తగ్గించుకున్నారు. నిన్నటి దాకా అంతో ఇంతో ఆశలు ఉన్న సూర్యకు బందోబస్త్ పెద్ద షాక్ ఇచ్చింది. ఇక సూర్య అంటేనే తెలుగు బ‌య్య‌ర్లు భ‌య‌ప‌డిపోతున్నారు. బందోబ‌స్త్‌తో ఇక సూర్య సినిమాలు కొనే ప‌రిస్థితి కూడా లేదు.

Share.