బాహుబలి సీరిస్ సినిమాలతో ఒక్కసారిగా నేషనల్ స్టార్‌గా మారిపోయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అదే స్పీడ్ కంటిన్యూ చేయాలని ఏకంగా రు. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో సాహో సినిమా చేశాడు. కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకుడు సుజీత్‌ను నమ్మి ఈ సినిమా చేయడం… సినిమా డిజాస్టర్ అవ్వడంతో ప్రభాస్ ఆశలు అన్నీ రివర్స్ అయ్యాయి. సాహో సినిమాకి ఎడా పెడా ఖర్చు పెట్టేసారు.
సాహో కి అనుకున్న బడ్జెట్ వేరు. అయ్యింది వేరు. దుబాయ్ లాంటి దేశం లో కోట్లకి కోట్లు పెట్టి యాక్షన్ సన్నివేశాలు తీశారు. సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఆ ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. అందుకే ఈ సినిమా దెబ్బతో ప్రభాస్ దిగి వచ్చినట్టే తెలుస్తోంది. అందుకే ప్రభాస్ తన తదుపరి సినిమా బడ్జెట్ కంట్రోల్ పెట్టాడనే న్యూస్ ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది.
రాధాకృష్ణ దర్శకత్వంలో ఇండియా వైడ్ గా తెరకెక్కుతున్న జాన్ సినిమాకి భారీ బడ్జెట్ పెడుతున్నారు. సాహో సినిమాకు ముందే ఈ సినిమాను కూడా భారీగా తెరకెక్కించాలని అనుకున్నారు. 1965 కాలం నాటి కథతో తెరకెక్కే ఈ సినిమా యూరప్ బ్యాగ్రౌండ్ లో తెరక్కించాలట. అయితే ఇప్పుడు యూరప్ వెళితే బడ్జెట్ లిమిట్ దాటుతుందన్న భయంతో రామోజీ ఫిల్మ్‌సిటీలోనే సెట్స్ వేసి అక్కడే షూట్ చేస్తున్నారట.
సినిమాలో సెట్స్ ఎంతో ఇంపార్టెంట్ ఉంటేనే వెయ్యాలి.. లేదంటే వద్దని కూడా నిర్మాతలకు ప్రభాస్ చెప్పినట్టుగా టాక్. సాహో దెబ్బకి ప్రభాస్ కరెక్ట్ గా లైన్ లోకొచ్చినట్టుగా కనబడుతుంది. ఇక పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు జిల్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.