2020 సంక్రాంతి సీజన్ లో ఈసారి బాలకృష్ణ సినిమా రావట్లేదని బెంగ పెట్టుకున్న నందమూరి ఫ్యాన్స్ కు పండుగ సంబరాన్ని డబుల్ చేసేందుకు వస్తున్నాడు కళ్యాణ్ రాం. సతీష్ వేగేశ్న డైరక్షన్ లో కళ్యాణ్ రాం హీరోగా వస్తున్న సినిమా ఎంత మంచివాడవురా. ఆదిత్య మ్యూజిక్ సంస్థ నిర్మిస్తున్న మొదటి సినిమా ఇదే.
ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ మూవీని జనవరి 15న రిలీజ్ ప్లాన్ చేశారు. సినిమాలో కళ్యాణ్ రాం సరసన మెహ్రీన్ కౌర్ నటిస్తుంది. శతమానం భవతి సినిమాతో హిట్ అందుకున్న సతీష్ వేగేశ్న ఆ తర్వాత శ్రీనివాస కళ్యాణం సినిమా చేశాడు. అయితే ఆ సినిమా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.
శతమానం భవతి సినిమా సెంటిమెంట్ తో ఈసారి కూడా సంక్రాంతికి ఎంత మంచివాడవురా సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. 118 సినిమా హిట్ తో మంచి జోష్ లో ఉన్న కళ్యాణ్ రాం ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈమధ్య రిలీజైన ఈ మూవీ టీజర్ ఇంప్రెస్ చేయగా ఎంత మంచివాడవురా సినిమా ఎలాంటి సత్తా చాటుతుందో చూడాలి.