శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి సాంగ్ అందరికి తెలిసిందే. 1961లో సీతారామ కళ్యాణం సినిమాలోని పాట అది. అందులో సీత పాత్ర నటించినది ఎవరో కాదు గీతాంజలినే. అప్పటి నుండి ఆమె ఎన్నో తెలుగు, తమిళ, హింది, కన్నడ, మళయాళ సినిమాల్లో నటించారు. వెండితెర సీతమ్మ బుధవారం రాత్రి 11:45 గంటలకు తుది శ్వాస విడిచారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆమె గుండెపోటు రావడం వల్ల అపోలో హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ పొందుతున్నారు.
అయితే హాస్పిటల్ లో ఉన్న టైం లోనే మరోసారి హార్ట్ స్ట్రోక్ రావడంతో గీతాంజలి కన్నుమూశారు. గీతాంజలి అసలు పేరు మణి. ఆమె హిందిలో ప్యారిస్ మణి సినిమా చేస్తున్న టైంలో సినిమా టైటిల్ లో మణి ఉందని ఆమె పేరుని గీతాంజలిగా మార్చారు ఆ నిర్మాతలు. అప్పటినుండి ఆమె గీతాంజలిగానే పేరు తెచ్చుకున్నారు. కాకినాడలో పుట్టిన గీతాంజలి తెలుగులో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు.