‘ వాల్మీకి ‘ క‌థ జ‌నాల‌కు ఎక్కుతుందా.. తేడా కొడుతోందే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ నటించిన వాల్మీకి మరో నాలుగు రోజుల్లో థియేటర్లలో అడుగుపెట్టనుంది ఇప్పటికే రిలీజ్ అయిన ఆడియో సినిమాపై అంచనాలు పెంచింది. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో ? అన్న ఆసక్తి ఒక్కటే అందరిలోనూ ఉంది. నాలుగేళ్ల క్రితం రిలీజ్ అయిన జిగ‌ర్‌తండా సినిమాను హరీష్ శంకర్ తెలుగు ప్రేక్ష‌కుల‌ అభిరుచికి తగ్గట్టుగా ఎలాంటి ? మార్పులు చేశాడు అన్నది ఒక్కటే తెరమీద చూడాల్సిందే. క‌ల్ట్ క్లాసిక్‌గా పేరు తెచ్చుకున్న జిగ‌ర్‌తండాను అరవ సినిమాలు చూసే అలవాటు ఉన్న ప్రేక్షకులు అప్పుడే సోషల్ మీడియాలో…. యూట్యూబ్లో చేసేసారు.

అంతెందుకు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ చేసిన ద‌బాంగ్‌ సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల టేస్ట్‌కు అనుగుణంగా మార్పులు.. చేర్పులు చేసి తెలుగులో గబ్బర్ సింగ్‌గా రీమేక్ చేసి హిట్ కొట్టాడు హరీష్ శంకర్. ఇప్పుడు వాల్మీకి విషయంలో హరీష్ మ్యాజిక్ ఎలా ? ఉంటుందా అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇక ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమా కథ కూడా ట్రెండ్ అవుతుంది.

సెకండ్ హీరోయిన్ మృణాళినితో అధర్వ ప్రేమలో ఉంటాడు. కానీ వాల్మీకిగా నటిస్తున్న హీరో గణేష్ పాత్ర కూడా ఈ అమ్మాయి మీదే మనసు పారేసుకుంటుంది. కట్ చేస్తే ట్రయాంగిల్ లవ్ షురూ. త‌మిళ్‌లో మాత్రం ఇలా ఉండ‌దు… చాలా నేచుర‌ల్‌గా అనిపించే ఈ మార్పును వ‌రుణ్ ఇమేజ్ దృష్టిలో ఉంచుకుని చేసిన‌ట్టుగా తెలుస్తోంది.

అసలే పూజా హెగ్డేది క్యామియో కాని క్యామియో లాంటి పాత్ర. ఫ్లాష్ బ్యాక్ లో మాత్రమే వస్తుంది. భారం మొత్తం మృణాళిని మీదే ఉంటుంది. మరి ఈ ముక్కోణపు ప్రేమ కథను మన ఆడియన్స్ డైజెస్ట్ చేసుకోగలరో లేదో అన్న డౌట్ అయితే అంద‌రికి ఉంది ? మ‌రి వాల్మికి ఏం చేస్తాడో ? చూడాలి.

Share.