మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా వాల్మీకి. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జిగుర్తండా రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో తమిళ హీరో అధర్వ కూడా నటించాడు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మిక్కి జే మేయర్ మ్యూజిక్ అందించాడు. 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 20న రిలీజ్ ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరుగబోతుంది.
ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా విక్టరీ వెంకటేష్ వస్తున్నట్టు తెలుస్తుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ ఈ ఇయర్ ఎఫ్-2 తో సూపర్ హిట్ అందుకున్నారు. కో బ్రదర్స్ గా నటించిన ఈ ఇద్దరి కాంబినేషన్ సూపర్ హిట్ అయ్యింది. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా అటు వెంకటేష్ కు ఇటు వరుణ్ తేజ్ కు మంచి హిట్ గా నిలిచింది. ఆ సినిమా టైంలో వెంకటేష్, వరుణ్ తేజ్ చాలా క్లోజ్ అయ్యారు.
అందుకే వరుణ్ తేజ్ సినిమా ఈవెంట్ కు వెంకటేష్ గెస్ట్ గా వస్తున్నారు. వాల్మీకి సినిమాలో వరుణ్ తేజ్ నెగటివ్ రోల్ లో నటిస్తున్నాడు. కోలీవుడ్ లో ఈ పాత్ర చేసిన బాబీ సింహాకి నేషనల్ అవార్డ్ వచ్చింది. టీజర్, ట్రైలర్ లో వరుణ్ తేజ్ కూడా అదరగొట్టినట్టు తెలుస్తుంది. వెంకటేష్ ఈవెంట్ గెస్ట్ గా వస్తే సినిమా హిట్ అన్న సెంటిమెంట్ ఉంది. మరి వరుణ్ తేజ్ వాల్మీకి సినిమా కూడా హిట్ అవుతుందో లేదో చూడాలి.