రెండు అఫైర్ల‌పై ఓపెన్ అయిన శృతీహాస‌న్‌..

Google+ Pinterest LinkedIn Tumblr +

సౌత్ స్టార్ హీరో, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్‌హాస‌న్ గారాల ప‌ట్టి శృతీహాస‌న్ ఇండ‌స్ట్రీలోకి తండ్రి బ్రాండ్‌తో వ‌చ్చినా చాలా త‌క్కువ టైంలోనే పాపుల‌ర్ హీరోయిన్ అయిపోయింది. త‌మిళ్‌తో పాటు తెలుగులో సూప‌ర్ హిట్ల‌తో ఓ వెలుగు వెలిగింది. ఓ సీనియ‌ర్ హీరో కుమార్తెగా ఉండి కూడా ఆమె క‌థానాయిక‌గా ఎంత బోల్డ్‌గా న‌టించిందో.. ఏ స్థాయిలో అందాలు ఆర‌బోసిందో కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు.

ఇక్క‌డ ఫామ్‌లో ఉండ‌గానే బ్రిటీష్‌ అబ్బాయితో ల‌వ్‌లో ప‌డ‌డంతో పాటు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అవ్వాల‌ని క‌ల‌లు క‌న‌డంతో ఆమె కెరీర్ గాడి త‌ప్పింది. బాలీవుడ్‌లో ఛాన్సుల కోసం సౌత్‌లో టాప్ హీరోల స‌ర‌స‌న వ‌చ్చిన ఛాన్సులు వ‌దులుకోవ‌డం ఒక మైన‌స్ అయితే… ఆమె ఫిజిక్‌పై కాన్‌సంట్రేష‌న్ చేయ‌క‌పోవ‌డం కూడా ఎదురు దెబ్బ తగిలిన‌ట్ల‌య్యింది.

ఇక శృతి కెరీర్‌లో కొంద‌రితో ఎఫైర్లు న‌డిపిన‌ట్టు కూడా వార్త‌లు వ‌చ్చాయి. గ‌తంలో ఆమె బాయ్ ఫ్రెండ్స్‌గా క్రికెట‌ర్ సురేష్ రైనాతో పాటు న‌టులు సిద్దార్థ్, విక్రాంత్ మాసేల పేర్లు వినిపించాయి. వీటి సంగ‌తేమో కానీ.. మైకేల్ అనే బ్రిటిష్ వ్య‌క్తితో శ్రుతి రిలేష‌న్‌షిప్‌లో ఉన్న సంగ‌తి మాత్రం వాస్త‌వం. ఈ విష‌యాన్ని శృతి ఓపెన్‌గానే అప్ప‌ట్లో చెప్పింది. ఇక ఇటీవ‌ల ఆ బ్రిటీష‌ర్ నుంచి శృతి విడిపోయింది.

ఇక ఆమె త‌న తాజా ఇంట‌ర్వ్యూలో గ‌తంలో ఇద్ద‌రితో రిలేష‌న్‌లో ఉన్నాన‌ని చెప్పింది. తొలి రిలేష‌న్ షిఫ్‌లో ఏ విష‌యం అయినా బ‌య‌ట‌క చెప్పేందుకు ఎంతో భ‌య‌ప‌డుతూ ఉండేదానిని అని..ఆ రిలేష‌న్‌షిప్‌ వర్కవుట్‌ కాలేద‌ని చెప్పింది. ఇక రెండో రిలేష‌న్ షిఫ్‌లో చాలా ఓపెన్‌గా ఉండేదానిని అని… జీవితాంతం క‌న‌సాగాల‌నే ఏ బంధం అయినా స్టార్ట్ చేస్తామ‌ని… అయితే రెండో రిలేష‌న్ షిఫ్ కూడా ఫెయిల్ అయ్యింద‌ని.. ప్ర‌స్తుతం తాను సింగిల్‌గా ఉంటున్నాన‌ని చెప్పింది.

Share.