రాహుల్ – పున‌ర్న‌వి హాట్ సీన్లపై నెటిజ‌న్ల ఫైర్‌..

Google+ Pinterest LinkedIn Tumblr +

వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పుడు తెలుగులో మూడో సీజన్ సందడి చేస్తోంది. ఎనిమిదో వారంలో బిగ్ బాస్ ఎలిమినేష‌న్ కోసం డిప‌రెంట్‌గా ప్లాన్ చేశాడు. ఒక‌రి కోసం మ‌రొక‌రు త్యాగాలు చేసేలా స్కిట్ రెడీ చేశాడు. ఇది రెండో సీజ‌న్లో కూడా న‌డిచింది. ఇక హౌస్‌లో ముందు నుంచి సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్‌కు పున‌ర్న‌వి భూపాలంకు మ‌ధ్య స‌మ్‌థింగ్‌.. స‌మ్‌థింగ్ న‌డుస్తుంద‌న్న సందేహాలు అంద‌రికి ఉన్నాయి. ఇక తాజాగా త్యాగాల నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో పున‌ర్న‌విని సేవ్ చేసేందుకు రాహుల్ ఏకంగా 20 గ్లాసుల కాక‌ర‌కాయ జ్యూస్ తాగాడు.

ఇందుకోసం రాహుల్ చాలా రిస్క్ చేశాడు. మ‌ధ్య‌లో వాంతులు అయినా కూడా రాహుల్ పున‌ర్న‌విని సేవ్ చేసేందుకు జ్యూస్ తాగేశాడు. చాలా మందికి 20 గ్లాసుల జ్యూస్ తాగుతాడా ? లేదా ? అన్న సందేహం క‌లిగినా రాహుల్ మాత్రం రిస్క్ చేసి మ‌రీ జ్యూస్ తాగి ఆమెను సేవ్ చేశాడు. వెంట‌నే పున‌ర్న‌వి ఆనందం ప‌ట్ట‌లేక రాహుల్‌ను గ‌ట్టిగా హ‌గ్ చేసుకుని… స్ట్రాంగ్ కిస్ ఇచ్చింది.

ఇక గ‌తంలో కూడా హౌస్‌లో వీరిద్ద‌రు అంద‌రు ప‌డుకున్నాక అర్ధ‌రాత్రి దాటాక కూడా క‌బుర్లు చెప్పుకుంటూ వ‌స్తున్నారు. రాహుల్ మ‌ధ్య‌లో ఓ సారి పున‌ర్న‌వికి ప్ర‌పోజ్ కూడా చేశాడు. ఇక తాజాగా కాక‌ర‌కాయ‌ల జ్యూస్ త‌ర్వాత రాహుల్‌ పునర్నవిల స్నేహం ఎక్క‌డికో వెళ్లిపోతుంద‌ని అంద‌రూ అనుకుంటున్న‌లోగానే బిగ్‌బాస్‌ ఓ ట్విస్ట్‌ ఇవ్వనున్నాడు. రాహుల్‌ను సేవ్‌ చేయడానికి పునర్నవి సీజన్‌ మొత్తం నామినేట్‌ చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటించాడు. చివ‌ర‌కు రాహుల్‌కే ఇది న‌చ్చ‌క‌పోవ‌డంతో రాహుల్ నామినేట్ అయ్యాడు.

ఇదిలా ఉంటే హౌస్‌లో వీరి ముద్దులు, హగ్గుల‌పై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్ల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వీరిద్ద‌రు కావాల‌నే త‌మ మ‌ధ్య ఎఫైర్ ఉంద‌ని క్రియేట్ చేస్తూ తెలివిగా గేమ్ ఆడుతున్నార‌ని.. అందుకే ఎలిమినేష‌న్ నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా నెట్టుకొస్తున్నార‌ని కొంద‌రు అంటుంటే.. మ‌రికొంద‌రు మాత్రం లేదు వీరు జ‌న్యూన్‌గానే గేమ్ ఆడుతున్నార‌ని అంటున్నారు. మ‌రి వీరిద్ద‌రి బంధం హౌస్‌లో ఎలా ? మ‌లుపులు తిరుగుతుందో ? చూడాలి.

Share.