యువ హీరో రాజ్ తరుణ్ లవ్ స్టోరీ విషాదాంతంగా మిగిలిందట.. ఉయ్యాల జంపాల సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ ఆ తర్వాత కుమారి 21ఎఫ్ సినిమాతో క్రేజీ హిట్ కొట్టాడు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో రాజ్ తరుణ్ చేసిన ఆ సినిమా తర్వాత మనోడి కెరియర్ స్ట్రాంగ్ అవుతుందని భావించారు కాని ఆ తర్వాత కథల విషయంలో సరైన ఎంపిక చేసుకోలేని రాజ్ తరుణ్ వరుసగా ఫ్లాప్ సినిమాలు చేశాడు.
ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్న తను ఈమధ్యనే ఓ అమ్మాయిని లవ్ చేస్తున్నట్టు వెళ్లడించాడు. పెళ్లంటూ చేసుకుంటే ఆమెనే పెళ్లి చేసుకుంటా అని అన్నాడు. అయితే ఇప్పుడు తను చేస్తున్న ఓ సినిమాలో కూడా లవ్ స్టోరీ చేస్తున్న రాజ్ తరుణ్ అందులో తన ప్రేమ కథను విషాదాంతం చేస్తున్నాడట. దిల్ రాజు బ్యానర్ లో రాజ్ తరుణ్ హీరోగా వస్తున్న సినిమా ఇద్దరిలోకం ఒకటే. ఈ సినిమాలో షాలిని పాండే హీరోయిన్ గా నటిస్తుంది.
మాములుగా అయితే ప్రేమకథల్లో హీరో ప్రేమ త్యాగం చేస్తాడు కానీ ఇ ఈ సినిమాలో మాత్రం హీరోయిన్ తన లవ్ సాక్రైఫైజ్ చేస్తుందట. మరి ఈ విషాదాంత ప్రేమ కథను దర్శకుడు జి.ఎన్.కృష్ణ ఎలా తెరకెక్కిస్తున్నాడో చూడాలి. డిసెంబర్ 25న సినిమా రిలీజ్ అన్నారు అయితే సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ మాత్రం చేయట్లేదు.