యువ హీరో రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల సినిమాతో తెరంగేట్రం చేయగా అతని కెరియర్ లో కుమారి 21ఎఫ్ మూవీ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. సుకుమార్ రైటింగ్స్.. సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సూర్య ప్రతాప్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో హేబ్భా పటేల్ అందాలు యూత్ ఆడియెన్స్ ను అలరించాయి. ఈ సినిమా తర్వాత రాజ్ తరుణ్ కు సూపర్ క్రేజ్ ఏర్పడింది.
అయితే కుమారి సినిమాతో వచ్చిన క్రేజ్ వాడుకోలేదు రాజ్ తరుణ్. సినిమాల సెలక్షన్ లో తొందరపడిన రాజ్ తరుణ్ కెరియర్ అస్తవ్యస్తం అయ్యేలా చేసుకున్నాడు. ప్రస్తుతం రాజ్ తరుణ్ ఇద్దరిలోకం ఒకటే సినిమా చేశాడు. డిసెంబర్ 25న ఈ మూవీ రిలీజ్ ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత రాజ్ తరుణ్ మరోసారి సుకుమార్, సూర్య ప్రతాప్ కాంబో సినిమాలో నటిస్తున్నాడని అన్నారు.
కాని ఆ ప్రాజెక్ట్ నుండి రాజ్ తరుణ్ ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది. సుకుమార్ రైటింగ్స్ లో వస్తున్నా ఈ సినిమాలో రాజ్ తరుణ్ ప్లేస్ లో యువ హీరో నిఖిల్ వచ్చాడు. రీసెంట్ గా వచ్చిన అర్జున్ సురవరం సినిమాతో హిట్ అందుకున్న నిఖిల్ సుకుమార్ నిర్మాణంలో సినిమా ఛాన్స్ అందుకోవడం నిజంగా లక్కీ అని చెప్పొచ్చు. ఇన్నాళ్ళు ప్రయోగాలతో కెరియర్ సాగించిన నిఖిల్ ఈ సినిమాతో కమర్షియల్ స్కేల్ లో వస్తాడని చెప్పొచ్చు.