బిగ్‌బాస్ విన్న‌ర్ రాహుల్ ప్రైజ్‌మ‌నీతో ఏం చేస్తాడంటే…

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు బుల్లితెర పాపుల‌ర్ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్-3 టైటిల్‌ను గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ గెలుచుకున్నారు. అంద‌రి అంచ‌నాలు త‌ల్ల‌కిందులు చేస్తూ అండ‌ర్ డాగ్‌గా ఉన్న రాహుల్ బిగ్‌బాస్ విన్న‌ర్ అవ్వ‌డంతో రాహుల్ అభిమానులు, ఫాలోవ‌ర్స్ మామూలుగా సంబ‌రాలు చేసుకోవ‌డం లేదు. ఇక విన్న‌ర్ అయిన రాహుల్‌కు స్టార్ హీరో చిరంజీవి ట్రోఫీతో పాటు రు. 50 లక్ష‌ల చెక్ ఇచ్చారు.

యాంకర్, నటి శ్రీముఖి చివరి వరకు రాహుల్‌కు గట్టి పోటీ ఇచ్చారు. చివ‌రి వ‌ర‌కు శ్రీముఖి టైటిల్ రేసులో ముందున్నా చివ‌ర్లో శ్రీముఖి యాంటీ ఓటింగ్ రాహుల్‌కు ప‌డ‌డంతో రాహుల్ విన్ అయ్యాడు. ఈ సందర్భంగా తనను విజేతగా నిలిపిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు రాహుల్ ధన్యవాదాలు తెలిపారు.

ఇక రాహుల్ హౌస్‌లో ఉండ‌గానే తాను ప్రైజ్‌ మనీ గెలిచిన తర్వాత ఆ డబ్బుతో బార్బర్‌ షాప్‌ పెడతానని ప్రకటించడంతో అతడికి సింప్లిసిటీ, కులవృత్తి మీదున్న గౌరవాన్ని అందరూ అభినందిస్తున్నారు. అస‌లు అత‌డు ఏ విష‌యంలో అయినా ఓపెన్‌గా ఉండ‌డ‌మే అత‌డికి ప్ల‌స్ అయ్యింది. ఇక త‌న రంగుపై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా అత‌డు ఎప్పుడు ఫీల్ అవ్వ‌లేదు. ఇక ఫ్రైజ్‌మ‌నీలో కొంత న‌గ‌దుతో అత‌డి త‌ల్లిదండ్రుల‌కు ఓ ప్లాట్ కూడా కొనిస్తాన‌ని కూడా విన్ అయ్యాక రాహుల్ తెలిపాడు.

Share.