జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ సినిమాల మీద పడ్డారు. రాజకీయంగా ఆయన తనకు భవిష్యత్తు లేదని భావించి మళ్ళీ సినిమాల మీద దృష్టి పెట్టారు. ఒక రీమేక్ సినిమాలో నటించడానికి పవన్ సిద్దమయ్యారు. ఇక ఈ సినిమా మీద పవన్ ఫాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు. రీమేక్ చిత్రం కావడంతో ఆయనకు మంచి విజయం రావాలని, సిని కెరీర్ ఎక్కడా ఆగవద్దని వాళ్ళు పూజలు కూడా చేసే పరిస్థితికి వచ్చారు. ఈ సినిమా మీద పవన్ కూడా ఎక్కువగానే దృష్టి పెట్టారని ఎలాగైనా ఈ సినిమా హిట్ అవ్వాలనే భావనలో ఉన్నారని అంటున్నారు.
అయితే ఇక్కడ ఆయన ఫాన్స్ మాత్రం భయపడిపోతున్నారట. దానికి కారణం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్… అత్తారింటికి దారేది సినిమా తర్వాత సోలోగా ఒక్క హిట్ కూడా కొట్టలేదు. ఆ తర్వాత వచ్చిన కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్, అజ్ఞాతవాసి సినిమాలు ఫ్లాపులుగా నిలిచాయి. ఆ మూడు సినిమాల మీద అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నా హిట్ అవ్వలేదు. ఇక సినిమా కొన్న బయ్యర్లు కూడా భారీగా నష్టపోయారు. ఇదే ఫాన్స్ కి సమస్యగా మారిందని సమాచారం.
పవన్ సినిమా అనగానే అభిమానుల హడావుడి అంతా ఇంత కాదు. ఇప్పుడు ఆయన తర్వాత చేసే సినిమాల మీద ఆశాలుపెట్టుకోవడం అవి ఫ్లాప్ అవ్వడం ఇతర హీరోల అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం, దీనికి తోడు ఆయన ఎన్నికలప్పుడు మళ్ళీ గడ్డం పెంచి ప్రజాసమస్యల మీద మాట్లాడటం. ఆయన నిర్ణయాలు, సినిమాల ఫ్లాపులతో భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు చేసే సినిమా ఫ్లాప్ అయితే మాత్రం తమ పరువు పోతుంది అనే భావనలో ఫాన్స్ ఉన్నారు. అందుకే ఈ సినిమా వస్తుందనే ఆనందం కంటే హిట్ అవుతుందా లేదా అనే భయం పవన్ ఫ్యాన్స్‌లో ఎక్కువుగా ఉందట.