యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలితో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకోగా ఆ తర్వాత వచ్చిన సాహో సినిమాతో కూడా బాలీవుడ్ ఆడియెన్స్ ను మెప్పించాడు. ప్రాఫిట్ అండ్ లాస్ ల గురించి పక్కన పెడితే ప్రభాస్ అంటే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. అందుకే ప్రభాస్ తో సినిమా కోసం ఇప్పుడు దర్శక నిర్మాతల మధ్య గట్టి పోటీ ఏర్పడింది. ప్రస్తుతం ప్రభాస్ జాన్ సినిమా చేస్తున్నాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.
ఈ సినిమా కూడా యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేసే సినిమా కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారట. కేవలం టాలీవుడ్ నిర్మాతలే కాదు బాలీవుడ్ నిర్మాతలు కూడా ప్రభాస్ తో సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. తెలుగులో ప్రభాస్ తో రెండు సినిమాలు నిర్మించిన దిల్ రాజు కూడా ప్రభాస్ తో సినిమా చేయాలని తహతహలాడుతున్నాడట.
ప్రభాస్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన మున్నా, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. అయితే ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేసి హిందిలో కూడా ఓన్ రిలీజ్ చేయాలని చూస్తున్నాడు దిల్ రాజు. ప్రభాస్ కోసం ప్రొడ్యూసర్స్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తుందట. ప్రభాస్ ఓకే అని అడ్వాన్స్ తీసుకునే వరకు సినిమా కన్ ఫాం కాదన్నట్టే. మరి జాన్ తర్వాత ప్రభాస్ సినిమా ఏదై ఉంటుందో చూడాలి.