నీలి నీడలో కొమరం భీం అలియాస్ ఎన్టీఆర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాపై ఇప్పటికే తారాస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్.టి.ఆర్, అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబందించిన ఎలాంటి లుక్ రివీల్ చేయలేదు.

ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తూ వచ్చిన పోస్టర్ తప్ప ఏది లీక్ చేయలేదు జక్కన్న. అయితే నిన్న కొమరం భీమ్ జయంతి సందర్భంగా సినిమా నుండి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆర్.ఆర్.ఆర్ టైటిల్ తో వచ్చిన ఈ పోస్టర్ లో పక్కన పులి.. చేతిలో తుపాకి పట్టుకుని నీలి నీడలో ఉన్న కొమరం భీమ్ లుక్ రివీల్ చేశారు. అయితే తారక్ లుక్ మాత్రం లీక్ అవలేదు.

రాజమౌళి రాజముద్రతో ఈ పోస్టర్ రావడంతో కొమరం భీం గా తారక్ ఎలా ఉంటాడన్న ఎక్సైటింగ్ ఏర్పడింది. నిన్న తారక్ ఫస్ట్ లుక్ వస్తుందని ఆశపడ్డ ఫ్యాన్స్ కు నిరాశ మిగిలినా.. చూపించిన ఈ పిక్ లో ఎన్.టి.ఆర్ ను ఊహించుకుంటూ నందమూరి ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. ఈ సినిమాలో అజయ్ దేవగన్, అలియా భట్ వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారని తెలుస్తుంది.

Share.