నాచురల్ స్టార్ నాని ఇదివరకే తన ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించారు. ‘ఆ’ అనే ఒక విభిన్న చిత్రంతో అందరి మన్ననలను పొందాడు. ఇప్పుడు హిట్ అనే కొత్త చిత్రం నాని నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఈరోజు హైదరాబాద్ లో జరిగాయి. ఈ చిత్రానికి ‘ద ఫస్ట్ కేస్’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. విశ్వక్ సేన్ మరియు రుహాణి శర్మ ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారులు.
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. నాని మరియు ప్రశాంతి ఈ చిత్రానికి నిర్మాతలు. శరవేగంగా శరవేగంగా షూటింగ్ జరుపుకుని హిట్ మళ్లీ సంవత్సరం ప్రథమార్ధంలో రిలీజ్ కానుంది. వివేక్ సాగర్ స్వరాలు సమకూరుస్తున్నారు. శైలేష్ కొలను దర్శకులు.