‘నవాబ్’ పై చరణ్ వింత డెశిషన్.. తప్పా, రైటా?

Google+ Pinterest LinkedIn Tumblr +

మణిరత్నం డైరక్షన్ లో వచ్చిన రీసెంట్ మూవీ నవాబ్. అరవింద స్వామి, శింభు, అరుణ్ విజయ్ కలిసి నటించిన సినిమా అది. అయితే ధ్రువ తర్వాత మణిరత్నం నుండి చరణ్ కు ఓ సినిమా ఆఫర్ వచ్చింది. అది నవాబ్ సినిమానే అని తెలుస్తుంది. నవాబ్ సినిమాలో శింభు చేసిన రుద్ర పాత్రకి చరణ్ ను అనుకున్నారట. చరణ్ కూడా దాదాపు ఓకే అన్నట్టే ఊపు చేశాడు.

కాని ఎందుకో చివరి నిమిషంలో డ్రాప్ అయ్యాడు. ఆ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చరణ్ చేయాల్సిన రుద్ర పాత్ర శిభు చేసి మెప్పించాడు. అయితే ఈ పాత్ర చరణ్ చేయకుండా ఉన్నదే మంచిదంటున్నారు. చరణ్ చేసి ఉంటే తమిళంలో అతనికో మార్కెట్ వచ్చేదేమో కాని తెలుగులో స్టార్ ఇమేజ్ ఉన్న చరణ్ నలుగురితో కలిసి ఓ క్యారక్టర్ గా చేయడం మెగా ఫ్యాన్స్ కు నచ్చేది కాదు.

చరణ్ నిర్ణయాన్ని మెగా ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు. అది కాదన్న తర్వాత రంగస్థలం చేశాడు. ఆ సినిమా సృష్టించిన రికార్డులు అందరికి తెలిసిందే. ఇక ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ లో మూవీ చేస్తున్నాడు చరణ్. స్టేట్ రౌడీ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

Share.