నందమూరి హీరో కళ్యాణ్ రాం హీరోగా సతీష్ వేగేశ్న డైరక్షన్ లో వస్తున్న సినిమా ఎంత మంచివాడవురా. శివలెంక కృష్ణ ప్రసాద్, ఆదిత్య మ్యూజిక్ వారు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ రాం సరసన మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా టీజర్ కూడా ఆడియెన్స్ ను మెప్పించింది. అయితే ఈ సినిమా రిలీజ్ ను జనవరి 14న ఫిక్స్ చేశారు.
ఓ పక్క సంక్రాంతికి నువ్వా నేనా అనేలా మహేష్ సరిలేరు నీకెవ్వరు.. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో గట్టి పోటీ ఇస్తున్నాయి. ఇప్పుడు కళ్యాణ్ రాం సినిమా కూడా ఆ రేసులో నిలవనుంది. అయితే నందమూరి హీరో సినిమాకు అంత బజ్ లేకపోవడం ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఉండటం వల్ల ఎంత మంచివాడవురా సినిమా బిజినెస్ జరగట్లేదట. అల వైకుంఠపురములో.. సరిలేరు నీకెవ్వరు రెండు క్రేజీ ప్రాజెక్టులే.
ఆ సినిమాల టీజర్లు కూడా సంచలనం సృష్టించాయి. అందుకే వాటితో పోటీ పడాలంటే కష్టమే. అయితే ఎవరికి ఉండే మార్కెట్ వారికి ఉంటుంది. కళ్యాణ్ రాం సినిమా డిస్ట్రిబ్యూటర్స్ ఇంట్రెస్ట్ చూపించట్లేదట. అందుకే నిర్మాతలు రిలీజ్ విషయంలో డైలమాలో ఉన్నారని తెలుస్తుంది.