దీపావళి సందర్భంగా నట సిం హం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తను చేస్తున్న సినిమా టైటిల్ ఎనౌన్స్ చేశారు. కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు రూలర్ అని టైటిల్ పెట్టారు. అంతేకాదు సినిమాకు సంబందించిన బాలయ్య పోలీస్ లుక్ కూడా రివీల్ చేశారు. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ రోల్స్ లో నటిస్తుందని తెలుస్తుంది. ఇదిలాఉంటే ఈ సినిమా టైటిల్ విషయంలో నందమూరి ఫ్యాన్స్ డబుల్ హ్యాపీగా ఉన్నారు.
రూలర్ అన్న టైటిల్ వినగానే ఎన్.టి.ఆర్ దమ్ము సినిమాలోని పాట గుర్తుకొస్తుంది. బోయపాటి శ్రీను డైరక్షన్ లో తెరకెక్కిన ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు కాని రూలర్ అన్న సాంగ్ మాత్రం నందమూరి ఫ్యాన్స్ కు బాగా నచ్చింది. ఆ తర్వాత ఆ టైటిల్ తో ఎన్.టి.ఆర్ సినిమా చేయాలని చూశాడు. అయితే అబ్బాయ్ టైటిల్ బాబాయ్ వాడుతాడా అన్న డౌట్లు బాగా వచ్చాయి. హరికృష్ణ మరణానికి ముందు వరకు ఎడమొహం పెడమొహం గా బాబాయ్ అబ్బాయ్ తండ్రి మరణంతో బాధలో ఉన్న తారక్, కళ్యాణ్ రాం లకు చిన్నాన్నగా మంచి సపోర్ట్ ఇచ్చాడు బాలకృష్ణ.
వారు కలిసింది ఒక బాధా కరణమైన విషయానికే అయినా సమాధానం చెప్పింది మాత్రం కొన్ని ప్రశ్నలకని చెప్పొచ్చు. ఫైనల్ గా ఎన్.టి.ఆర్ రూలర్ టైటిల్ ను బాలకృష్ణ వాడటం వల్ల మేమంతా ఒక్కటే అని మరోసారి నందమూరి ఫ్యాన్స్ కు హింట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. రూలర్ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చిరంతన్ భట్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు.