తాప్సీ లవర్ గురించి షాకింగ్ నిజాలు..

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన తార తాప్సీ. అయితే కొంతకాలానికి ఆమే మొహం మెత్తినట్లుంది.. అందుకే హీరోలు, దర్శకులు ఆమే గ్లామర్ షోకి తప్ప నటనకి పనికిరాదని అన్నారంతా.. అదే తార ఇప్పుడు బాలీవుడ్లో మంచి ఫర్ఫామర్గా ప్రశంసలు అందుకుంటోంది. అక్కడ తాప్సీకి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుని దూసుకుపోతుంది. అయితే వెండితెరపై వెలుగులు చిందించే తాప్సీ నిజ జీవితంలో మాత్రం చాలా డేరింగ్ గర్ల్ అనే పేరుంది. సోషల్ మీడియాలో తన భావాలను నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా వెల్లడించే తాప్సీని అందరు తలబిరుసు అంటారు.

అయితే ఇంతకుముందు పెళ్లి విషయంలో వివాదాస్పద స్టేట్మెంట్స్ ఇచ్చిన ఈ భామ ఇప్పుడు కొంత వెనక్కి తగ్గింది. తన లవ్ లైఫ్ గురించి కూడా క్లారీటీ ఇచ్చింది. ఒక బాలీవుడ్ హీరోతో ఆమెది సీక్రెట్ లవ్ అఫైర్ అని చాలా కాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ గాసిప్ల సౌండ్ ఇప్పుడు లైడ్ స్పీకర్ రేంజ్లో మార్మోగుతుండడంతో తానే స్వయంగా అసలు విషయాన్ని బయటపెట్టింది. నేను ప్రేమిస్తున్న వ్యక్తి సినిమా హీరో కాదు, క్రికెటర్ అంతకన్నా కాదు అంటూ, అతడుఇక్కడివాడు కాదని హింట్ ఇచ్చింది.

తాప్సీ ఇంతకుముందు ఒక విదేశీ బ్యాడ్మింటన్ ప్లేయర్తో డేటింగ్ చేసింది. ఆ తర్వాత అతనికి బ్రేకప్ చెప్పి.. ఒక బాలీవుడ్ హీరోతో డేటింగ్ మొదలు పెట్టింది. రీసెంట్గా పెళ్లయిన ఒక బాలీవుడ్ హీరోతో రిలేషన్షిప్తో ఉందన్న పుకారు బయటికి వచ్చింది. మొదట ఈ విషయంలో స్పందించలేదు. తరువాత ఆ హీరో కాపురంలో చిచ్చురేగిందని. అందుకే మరో వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు నాటకమాడుతున్నట్లు మరో ప్రచారం జరిగింది. సో ఇప్పుడు తాప్సీ చెపుతున్న దాని ప్రకారం ఆమే ప్రేమించే వ్యక్తి ఏదేశానికి చెందిన వ్యక్తి అయి ఉంటాడు అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

Share.