తప్పు మీద తప్పు చేస్తున్న పూజా హెగ్దె..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పూజా హెగ్దె.. ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఈ ముద్దుగుమ్మ పేరు సెన్సేషనల్ గా మారింది. మొదట్లో ఐరన్ లెగ్ అంటూ పేరు మోసిన ఈ అమ్మడు డిజే సినిమాతో బికినితో కనిపించి అలరించింది. ఆడియెన్స్ తన నుండి ఏం ఆశిస్తున్నారో కనిపెట్టిన అమ్మడు ఆ సినిమా నుండి హాట్ లుక్స్ తో అదరగొడుతుంది. ప్రస్తుతం వరుసగా స్టార్ సినిమా ఛాన్సులు అందుకుంటున్న పూజా హెగ్దె తెలుగులో ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్నా సరే బాలీవుడ్ పై ఆశ చంపుకోవడం లేదు.

అందుకే అక్కడ వచ్చిన ఏ చిన్న అవకాశం అయినా చేస్తుంది. లేటెస్ట్ గా హౌజ్ ఫుల్ 4 సినిమాలో నటించింది పూజా హెగ్దె. అయితే సినిమాలో ఆమెది తగిన ప్రాధాన్యత గల పాత్ర కాదని తెలుస్తుంది. కృతి కార్బందాతో పాటుగా పూజా కూడా ఏదో ఒక సైడ్ హీరోయిన్ గా ఆ సినిమాలో కనిపించింది. కేవలం గ్లామర్ షోకి మాత్రం హౌజ్ ఫుల్ 4లో పూజా హెగ్దెని తీసుకున్నారని చెప్పొచ్చు.

తెలుగులో స్టార్ హీరోయిన్ గా నటిస్తున్న పూజా బాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు చేయడం వల్ల తన ఇమేజ్ కు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే తెలుగులో స్టార్ ఛాన్సులు వచ్చినా సరే హిందిలో సైడ్ రోల్స్ చేసినా చాలని భావిస్తుంటారు హీరోయిన్స్. వారి పంథాలోనే పూజా కూడా ఆ తప్పు చేస్తుంది. అయితే ఇలానే చేస్తే అక్కడ ఎలాగు ఆ పాత్రలే వస్తాయి కాబట్టి ఇక్కడ వచ్చిన స్టార్ క్రేజ్ కాస్త తగ్గిపోయే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ విషయంలో జాగ్రత్త పడక తప్పదు.

Share.