సంక్రాంతికి మహేష్ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో కొంతమంది యువ హీరోలతో పాటు వెంకటేష్, బాలక్రిష్ణ సినిమాలు డిసెంబర్లోనే విడుదలకు సిద్ధంకావడం గమనార్హం. ఈ మాసంలో అగ్రహీరో బాలయ్య రూలర్‌తో పాటు నాగచైతన్య వెంకీ కాంబినేషన్లో వస్తున్న వెంకీమామ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలాగే తేజు ప్రతిరోజు పండుగ రోజే సినిమా కూడా ఈ మాసంలోనే విడుదల కానుంది. అయితే ఈ చిత్రాల మధ్య విభిన్నతే ఇప్పుడు ప్రేక్షకులకు ఆసక్తి కలిగిస్తోంది.
క్లాస్ వర్సెస్ మాస్..ఊర మాస్ చిత్రాలుగా అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే రూలర్ ట్రైలర్ యూట్యూబ్‌లో సందడి చేస్తోంది. తానేంటో సినిమాలో బాలయ్య చెప్పకనే చెప్పేశారు. ఈ మాసంలో ముందుగా వెంకీమామ విడుదల కానుంది. పూర్తిగా ఫ్యామిలీ వినోదాత్మక చిత్రంగా తెరకెక్కించారు. కుటుంబ సభ్యుల మధ్య కొనసాగే అనుబంధాలతో పాటు హాస్యానికి ఈసినిమాలో పెద్దపీట వేసినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా కుటుంబ కథాచిత్రమేనని సమాచారం.
క్లాస్ ఆడియెన్స్‌ను కనెక్ట్ చేసేవిధంగా ఉంటుందని చిత్రవర్గాల ద్వారా తెలుస్తోంది. అటు వెంకీకి ఇటు చైతుకు కుటుంబ ప్రేక్షకుల్లో ఆదరణ ఎక్కువ కాబట్టి మాస్ అంశాలు.. బోల్డ్ అంశాలకు స్కోప్ తక్కువేనని చెబుతున్నారు. ఇదే జానర్లో తేజు-మారుతిల కాంబినేషన్లో వస్తున్న ‘ప్రతిరోజూ పండగేస సినిమా కూడా కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకోనుంది. ఈ రెండు చిత్రాలకు భిన్నంగా బాలయ్య రూలర్‌తో పాటు యువహీరో కార్తికేయ గుమ్మకొండ ’90ML’. సినిమాలు మాస్‌తో పాటు యువ ప్రేక్షకులను టార్గెట్చేస్తూ తెరకెక్కించారు.
మొత్తంగా టాలీవుడ్లో మాస్ వర్సెస్ క్లాస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి డిసెంబర్లో క్లాస్ గెలుస్తుందో…మాస్ నిలుస్తుందో చూడాలంటూ విశ్లేషకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. సంక్రాంతికి ముందే వెంకీమామ..రూలర్ సినిమాలు విడుదలవుతుండటంతో కలెక్షన్ల పోటీ ఈ రెండు సినిమాల వద్దే ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో మరి.