టాలీవుడ్ సినిమాలు ఫ‌ట్‌… ఏం జ‌రుగుతోంది..

Google+ Pinterest LinkedIn Tumblr +

హిట్లు తక్కువ… ఫ్లాపులు ఎక్కువ ఇదే ఈ ఏడాది తెలుగుచిత్రసీమ పరిస్తితి. ఈ ఏడాది మొత్తంలో టాలీవుడ్ సినిమాలు ఎక్కువ శాతం బాక్సాఫీస్ బరిలో బోల్తా కొట్టేశాయి. ఏదో ఏడాది ప్రారంభంలో ఎఫ్2 ఒక్కటే భారీ విజయాన్ని దక్కించుకుంది. ఎఫ్2 అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్ రాబట్టింది. ఆ తరవాత వచ్చిన కొన్ని సినిమాలు భారీ ఫ్లాపులు మిగలగా, కొన్ని పర్వాలేదనిపించాయి. ఇక వేసవి కాలం చిత్రసీమకు మహేశ్ బాబు సినిమా మహర్షి కొంత ఊరటనిచ్చింది.

ఇది మహేశ్ కెరీర్ లోనే వంద కోట్లు కలెక్షన్ దాటింది. ఇక మహర్షి బ్లాక్ బస్టర్ తర్వాత టాలీవుడ్ లో చెప్పుకోదగిన భారీ విజయాలు నమోదు కాలేదు. మధ్యలో ఇస్మార్ట్ శంకర్ బాగానే ఆడినా, మిగతా సినిమాలు భారీ కలెక్షన్లు రాబట్టడంలో పూర్తిగా విఫలమయ్యాయి. సైరా, సాహో లాంటి సినిమాలు భారీ బడ్జెట్ తో వచ్చిన భారీగా కలెక్షన్లు రాబట్టడంలో పూర్తిగా విఫలమయ్యాయి. ఇక వీటికంటే తమిళ చిత్రాలే బెటర్ అనిపించాయి.

విజిల్, ఖైదీ సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. కానీ తెలుగు సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద జోరు చూపించలేకపోయాయి. విశాల్ యాక్ష‌న్ కూడా ఇక్క‌డ ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. అయితే ఈ విధంగా తెలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడానికి కారణాలు లేకపోలేదు. రొటీన్ కంటెంట్ సినిమాలు, వచ్చిన కథలే మళ్ళీ రిపీటెడ్ గా కనబడటం వల్ల ప్రేక్షకులకు రీచ్ కావడం లేదు. దీని వల్ల ప్రేక్షకులు థియేటర్లు వద్దకు రావాలన్న భయపడుతున్నారు.

ఇలాంటి సినిమాలు వల్ల డబ్బులు గుల్ల చేసుకోవడం తప్ప ఎలాంటి ఉపయోగం లేదనుకుంటున్నారు. ఈ ఐదారు నెలలు రొటీన్ రొట్ట సినిమాలే రావడం వల్ల తెలుగు ఇండస్ట్రీకి మహర్షి తర్వాత సరైన బ్లాక్ బస్టర్ లేకుండా పోయింది. ఇక టాలీవుడ్ ఆశలన్నీ వచ్చే ఏడాది మీద ఉంది. సంక్రాంతికి వచ్చే అల వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరూ చిత్రాలు, అలాగే జూలై వచ్చే ఆర్‌ఆర్‌ఆర్ పైనే ఆధారపడి ఉంది. డిసెంబర్ లో బాలయ్య, సాయి ధరమ్ తేజ్ సినిమాలు ఉన్న వాటిపై కూడా పెద్దగా ఆశలు లేవు.

Share.